ఇప్పటికే ఈ రాశులకు బాగా కలిసి వచ్చింది.. చెక్ చేసుకోండి
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. అలా సంచారం చేసే సమయంలో కొన్నిసార్లు మంచి సానుకూల ఫలితాలను, మరికొన్నిసార్లు ప్రతికూల ఫలితాలను కల్పిస్తుంటాయి. ఈనెల 26వ తేదీన శుక్రుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించాడు. గ్రహాలు రాశి సంచారంతోపాటు నక్షత్ర సంచారం కూడా చేస్తుంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం శనిదేవుడిది. దీన్ని ఆయన పరిపాలిస్తుంటాడు. శుక్రుడు, శని మిత్రులు. మిత్రుడి నక్షత్రంలోకి రావడంవల్ల కొన్ని రాశులవారికి మేలు కలగనుంది. వారి జీవితంలో నూతన మార్పులు చోటుచేసుకోవడంతోపాటు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
తులారాశి
శుక్రుడు ఈ రాశికి అధిపతి. కుటుంబ జీవనాన్ని కొనసాగిస్తున్నవారికి భారీ మొత్తంలో నగదు వస్తుంది. జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఆనందంగా ఉంటారు. శ్రేయస్సు, సంపద రావడానికి శుక్రుడు కారకుడు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించుకుంటే ఆనందంగా ఉంటారు. అందరూ కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళతారు. భారీ ఆర్థిక లాభాలు ఈ సమయంలోనే ఉన్నాయి. కొత్తగా ఇంటిని, వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆస్తులకు సంబంధించిన సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది.

కర్కాటక రాశి
ఈరోజు నుంచి వీరికి భారీ లాభాలున్నాయి. వ్యాపారస్తులకు భారీ ప్రాజెక్టులు దక్కుతాయి. పెద్ద మొత్తంలో ఆదాయం పొందుతారు. అదృష్టం కలిసిరావడంవల్ల మంచి స్థాయికి చేరుకుంటారు. విదేశాలకు సంబంధించిన ప్రాజెక్టులు కూడా వస్తాయి. కోరుకున్న కంపెనీలో ఉద్యోగస్థులు ఉద్యోగాన్ని కోరుకుంటారు. సంపాదన పరంగా వీరికి చాలా బాగుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎదుటివారితో మాట్లాడే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మాట తీరు విషయం వీరికి బాగా కలిసివస్తుంది.












Click it and Unblock the Notifications