అక్టోబర్ 20వరకు వీరికి అఖండ ధనయోగం అనుగ్రహించిన కుజుడు!

వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులలో ఏ గ్రహానికి ఆ గ్రహమే ప్రత్యేకం. ఆగస్టు 26వ తేదీన కుజుడు మిధునరాశిలోకి సంచారం చేశాడు. కుజుడు మిధునరాశిలో అక్టోబర్ 20వ తేదీ వరకు ఉండనున్నాడు. ఆ తర్వాత కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సమయంలో కుజుడి సంచారం కారణంగా శుభ మంగళ యోగం ఏర్పడుతుంది. ఈ శుభయోగం ప్రభావంతో కొన్ని రాశులవారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది.

మేషరాశి
కుజ గోచారం కారణంగా అక్టోబర్ 20వ తేదీ వరకు మేషరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశిలో కుజుడు మూడో స్థానం నుంచి సంచారం చేస్తున్న కారణంగా ఈ సమయంలో మేషరాశి జాతకులు చాలా ధైర్యంగాను, ఎలాంటి ఇబ్బంది అయినా ఎదుర్కొనే సామర్ధ్యాన్ని కలిగి ఉంటారు. ఈ సమయంలో కుజ గోచారం కారణంగా మేషరాశి జాతకుల కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

Until October 20 Mars blessed these zodiac signs with a great wealth

వృషభ రాశి
నేటి నుంచి 55 రోజుల కాలం వృషభ రాశి వారికి శుభకాలంగా చెప్పవచ్చు. వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వృషభ రాశి జాతకులు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఆదాయం పెంచుకునేందుకు కొన్ని కొత్త పనులను చేస్తారు. ఈ కాలంలో మీరు మెరుగైన ఆర్థిక ఫలితాలను పొందుతారు.

మిధునరాశి
కుజసంచారం వల్ల మిధున రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. అక్టోబర్ 20 వరకు మిధునరాశి వారి అదృష్టం ప్రకాశిస్తుంది. మిధున రాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో మెరుగ్గా ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం వరిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి సరైన సమయం. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు కుజ అనుగ్రహం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారు ఈ సమయంలో కొన్ని శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు పురోగతి కనిపిస్తుంది. అయితే కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో ఖర్చుల విషయంలో నియంత్రణ ఉండేలా చూసుకోవాలి. ఈ సమయంలో కర్కాటక రాశి వారు విదేశీ వనరుల నుండి ప్రయోజనాలను పొందుతారు.

సింహరాశి
సింహ రాశి వారికి అక్టోబర్ 20వ తేదీ వరకు బాగా కలిసి వస్తుంది. వీరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కెరీర్ పరంగా వీరు మంచి పురోగతి సాధిస్తారు. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. ఈ సమయంలో చేసే ప్రతి ప్రయత్నం లోను విజయాన్ని సాధిస్తారు. ఇది సింహరాశి వారికి అదృష్ట సమయం.

కన్యారాశి
కన్యా రాశి వారు అక్టోబర్ 20వ తేదీ వరకు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో కన్యారాశి జాతకులు అన్ని రంగాలలోనూ రాణిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. ఈ సమయంలో శుభవార్తలు వింటారు. ఎలాంటి ఇబ్బంది అయినా ఈ సమయంలో అధిగమిస్తారు.

మకరరాశి
మకర రాశి వారికి అక్టోబర్ 20 వరకు కుజ సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. మకర రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు వర్తక వ్యాపారాలలో లాభాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి శుభవార్తలు వింటారు. ఆస్తి సంబంధిత వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి.

కుంభరాశి
కుంభ రాశి వారికి కుజసంచారం కారణంగా ఇంకా అక్టోబర్ 20 వరకు శుభసమయంగా చెప్పొచ్చు. ప్రేమ వివాహం చేసుకోవాలని భావిస్తున్న వారికి కుటుంబ సభ్యుల ఆమోదం లభిస్తుంది. కుంభరాశి జాతకులు ఈ సమయంలో కుటుంబంతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. ఉన్నత విద్యలోనూ మంచి విజయం సాధిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+