వాస్తు ప్రకారం మనకు తెలియకుండా చేసే పొరపాట్లు ఇవే
వాస్తు ప్రకారం మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. కానీ అవి చాలా చిన్నవి కదా అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే అనేక దుష్ప్రభావాలను చూపుతాయి. వాస్తుకు ఉన్న శక్తి అది. అందుకే ఇంటి నిర్మాణంలోని ప్రతి అడుగు వాస్తుతో నిండి ఉండాలి అని మన పెద్దలు చెబుతుంటారు. ప్రతికూల శక్తుల వల్ల మన అభివృద్ధి కుంటుపడుతుంది. అందుకే నిత్యం పూజలు, ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడంవల్ల అనేక శుభ ఫలితాలను పొందుతాం.
ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి.
పనికిరాని వస్తువులు పారేయాలి.
పూజగది, వంటగది, మెయిన్ డోర్ శుభ్రంగా ఉండాలి.

ఆలస్యంగా నిద్ర లేవకూడదు.
ఉదయాన్నే లేచి తలుపులు, కిటికీలు తెరిచివుంచాలి.
సానుకూల శక్తి ప్రవేశించి మనను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుది.
వంటగదిలో వాడిన పాత్రలను ఎక్కువసేపు ఉంచకూడదు.
వాటిని వెంటనే శుభ్రం చేయాలి.
అలా చేయకపోతే సంపద, శాంతి తగ్గుతాయి.
పగిలిపోయిన అద్దాలు, పనిచేయని వాచీలు, విరిగిపోయిన వస్తువులు బయటపడేయాలి.
ప్రతిరోజు పూజలు చేయాలి.
ఉదయం, సాయంత్రం దీపం వెలిగించాలి.
భక్తితో ఉంటే సంపద, ఆనందం కలుగుతాయి.
శాంతిని, సౌభాగ్యాన్ని కలిగిస్తుంది.
ఎన్ని పనులన్నా రాత్రిపూట ఎంగిలి కంచాలను వదిలేయకూడదు.
వాటిని శుభ్రం చేసుకున్న తర్వాతే నిద్రకు ఉపక్రమించాలి.
మందులు వంటగదిలో ఉంచకూడదు.
దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.












Click it and Unblock the Notifications