వాస్తు ప్రకారం మీరు నివసించే ఇల్లు ఎత్తుపల్లాలున్న స్థలంలో ఉందా? మాములుగా ఉందా?
స్థలం కొంటాం. ఇల్లు కట్టేస్తాం. వాస్తును కూడా అనుసరిస్తాం. అయితే ముందుగా స్థలం కొనుగోలు చేసే సమయంలో ఆకారమే కాకుండా అది ఎత్తుపల్లాలుగా ఉందా? చదునుగా ఉందా? ఏ దిక్కులో ఎంత ఎత్తు ఉంది? ఎటువైపు ఎత్తు ఎక్కువ? పల్లం ఎటువైపు ఉంది? తదితరాలను కూడా అన్నీ పూర్తిగా తెలుసుకోవాలి. ఇందుకు వాస్తు నిపుణులను సంప్రదించి స్థలం చూపించాలి. వారి సూచనలు, సలహాల మేరకు ఇంటి నిర్మాణం జరుపుకోవాలి.
ఎత్తుపల్లాలు ఉన్న ఇంటికి రోడ్డు ఎటువైపు ఉందో చూడాలి.
దక్షిణం, పడమర వైపు ఎత్తు ఉండాలి
ఉత్తరం, తూర్పు వైపు పల్లం ఉండాలి

తూర్పు, ఉత్తరంవైపు పల్లంగా ఉంటే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.
సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి.
ఈశాన్యం మూల పల్లంగా ఉంటే చాలా మంచిది.
వాలుగా ఉంటే మట్టితో నింపి ఎత్తు చేయాలి.
నైరుతి మూల మాత్రం ఎప్పుడూ ఎత్తు ఎక్కువగా ఉండాలి.
నైరుతిలో పల్లం ఉంటే ఇంటి యజమానికి తీవ్ర అనారోగ్యం కలుగుతుంది.
దీంతోపాటు భారీ ఆర్థిక నష్టాలు వస్తాయి.
స్థలం కొండ ప్రాంతంలో ఉంటే మెట్ల మాదిరిగా మార్చుకోవచ్చు.
పైన ఉన్న మెట్లు పశ్చిమం లేదంటే దక్షిణం వైపు ఉండాలి.
కింద ఉండే మెట్లు తూర్పు లేదంటే ఉత్తరంవైపు ఉండాలి.
తూర్పున ఎత్తుగా, పడమర పల్లంగా ఉంటే పడమరవైపు ఎత్తు చేయాలి.
అప్పుడు తూర్పు వైపు వాలుగా మారుతుంది.
వర్షపు నీరు ఈశాన్యం గుండా బయటకు వెళ్లాలి.
స్థలం వాలుగా ఉండేలా చూసుకోవాలి.
ఈశాన్యం అత్యంత పల్లంగా ఉండాలి.












Click it and Unblock the Notifications