వాస్తు ప్రకారం కిచెన్‌లో పూజ చేయవచ్చా?

ప్రస్తుతం ఇళ్లల్లో స్థలం సరిపోక పూజగది ఉండటంలేదు. ప్రత్యేకంగా పూజ చేసుకోవడానికి కచ్చితంగా ఈశాన్యంలో కొంత స్థలం ఉండాలి. అది లేనప్పుడు చాలామంది వంటగదిలో చేస్తుంటారు. అయితే వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం కిచెన్ లో పూజ చేయవచ్చా? లేదా? అనే వివరాలను తెలుసుకుందాం. వారు చెబుతున్న ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే వంటగదిలో పూజ చేయాలా? వద్దా? అనే విషయంలో ఒక స్పష్టత వస్తుంది.

వంటగది అగ్నికి స్థానం
పూజ గది 'ఈశాన్యం'లో ఉండాలి.
అగ్, దైవ శక్తులు పక్కపక్కనే ఉండటం వల్ల
ఇంట్లో సానుకూల శక్తి ప్రభావితం అవుతుందని వాస్తు చెబుతోంది.

vastu Is it appropriate to perform pooja in the kitchen according to traditional principles

కిచెన్‌లో రకరకాల ఆహార పదార్థాలు వండుతాం.
పూజ గదికి ఉండాల్సిన పవిత్రత, ప్రశాంతత వంటగదిలో ఉండదు.
మీరు అపార్ట్‌మెంట్‌ లేదా చిన్న ఇంట్లో ఉండి
కిచెన్‌లోనే పూజ చేయాల్సి వస్తే దేవుడి పటాలు ఈశాన్య మూలలో ఉండేలా చూసుకోవాలి.
దేవుడి షెల్ఫ్ ఎప్పుడూ నేలపై ఉండకూడదు.
కనీసం మోకాళ్ల ఎత్తు కంటే పైన ఉండాలి.

వీలైతే దేవుడి షెల్ఫ్‌కు చిన్న చెక్క తలుపులు పెట్టండి.
లేదంటే ఒక తెర ఏర్పాటు చేయండి.
వంట చేసే సమయంలో లేదా భోజనం చేసేటప్పుడు ఆ తెరను మూసి ఉంచాలి.

స్టవ్ పైన నేరుగా దేవుడి పటాలను పెట్టకూడదు.
అలాగే సింక్ పక్కన కూడా ఉండకూడదు.
కిచెన్‌లో పూజ చేస్తున్నట్లయితే ఆ ప్రదేశం ఎప్పుడూ చాలా శుభ్రంగా ఉండాలి.
రాత్రి పూట ఎంగిలి పాత్రలు కిచెన్‌లో వదిలేయకూడదు.
పూజ చేసే సమయంలో అక్కడ తగినంత వెలుతురు ఉండేలా చూసుకోవాలి.
వాస్తు ప్రకారం వంటగదిలో పూజ చేయడం అంత మంచిది కాదు.
తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నట్లయితే,
పైన చెప్పిన నియమాలు పాటిస్తే సరిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+