వాస్తు ప్రకారం ఇంటికి పాటించాల్సిన నియమాలు, సూచనలు
వాస్తు శాస్త్రానికి అత్యధిక ప్రాముఖ్యత ఉంటుంది. కొంతమంది దీన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే చిన్న చిన్న విషయాలకే ఇంట్లో గొడవలు జరుగుతుంటుంటే దీనికి కచ్చితంగా వాస్తు దోషం ఉండితీరుతుంది. చిట్కాలు పాటించకపోతే అవి పెద్దవుతాయి. తరుచుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతుంటే కొన్ని పరిష్కారాలు కూడా ఉంటాయి. వాస్తు నిపుణులను సలహాను పాటిస్తుండాలి. అసలు ప్రధానంగా ఇంటికి కొన్ని వాస్తు లోపాలు లేకుండా చూసుకోవాలి. వాస్తును అనుసరించి ఉండాలేంటే ఏమేం ఉండాలనే విషయాలను తెలుసుకుందాం.
వంటగది విషయంలో వాస్తును బాగా అనుసరించాలి.
గ్యాస్ స్టవ్ ఆగ్నేయంలో ఉండాలి.
నీటి ఫిల్టర్, నీటి కుండ ఈశాన్యంలో ఉండాలి.
ఇలా ఉంటే డబ్బు సమస్యలు తీరిపోతాయి.
వేరే దిక్కులో ఉంటే గొడవలు ఎక్కువగా ఉంటాయి.

బెడ్ రూంలో తల భాగం దక్షిణం వైపు ఉండాలి.
ఉత్తరం వైపు తల పెట్టకూడదు.
దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
ఇంటి మధ్య భాగంలో బరువైన వస్తువులు పెట్టకూడదు.
ఇలా ఉంటే ఇంట్లో గిజిబిజి వాతావరణం నెలకుంటుంది.
ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉండాలి.
ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా చెప్పులు, బూట్లు ఉండకూడదు.
సింహద్వారానికి ఎదురుగా తులసి చెట్టు ఉండాలి.
ప్రధాన ద్వారం ఈశాన్యం, తూర్పు, ఉత్తరం ఉంటే మంచిది.
ఇంటి యజమాని బెడ్ రూం నైరుతి దిశలో ఉండాలి.
ఫర్నిచర్ దక్షిణం, పడమర గోడలకు ఆనుకొని ఉండాలి.
బాత్ రూం వాయువ్యం, పశ్చిమంలో ఉండాలి.












Click it and Unblock the Notifications