వాస్తు ప్రకారం రాత్రి నిద్రపట్టకపోతే ఇలా చేయాలి
మారిన జీవనశైలితో తలనొప్పి, మానసిక ఆందోళన, రాత్రిపూట నిద్రపట్టకపోవడం వంటి సమస్యలు చాలామందిని వేధిస్తున్నాయి. వీటన్నింటికీ పని ఒత్తిడి మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం నివసించే ఇంట్లోప్రతికూల శక్తి పెరిగినప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ప్రతికూల శక్తిని తరిమికొట్టి, ప్రశాంతతను పొందాలంటే ఏం చేయాలనేది తెలుసుకుందాం.
వంటగది
వంటగది కేవలం ఆకలి తీర్చే చోటు మాత్రమే కాదు,
అది ఇంటి ఆర్థి, ఆరోగ్య పరిస్థితిని నిర్ణయించే కీలకమైన చోటు.
రాత్రిపూట తిన్న తర్వాత మురికి పాత్రలను సింక్‌లో వదిలేయడం వాస్తు రీత్యా పెద్ద దోషం.
ఇది ఇంట్లో ప్రతికూల శక్తిని పెంచి, నిద్రలేమికి కారణమవుతుంది.
వంటగదిలో లేదా బాత్రూంలో కుళాయిలు లీక్ అవుతూ చుక్కలు పడుతుంటే..
అది మీ ఆర్థిక స్థితి కరిగిపోవడానికి, మనస్సులో అనవసర భయాందోళనలకు సంకేతం.
వెంటనే వాటిని రిపేర్ చేయిస్తే ప్రశాంతంగా ఉంటారు.

ప్రధాన ద్వారం
ఇంటి సింహద్వారం గుండానే సానుకూల శక్తి లోపలికి ప్రవేశిస్తుంది.
ప్రధాన ద్వారానికి ఎదురుగా చెప్పులు విడవడం లేదా పాత సామాగ్రిని పోగు చేయడం వల్ల
ఇంట్లోకి వచ్చే సానుకూల శక్తి ఆగిపోతుంది. ఇది ఇంట్లోవారు తీసుకునే నిర్ణయాలపై ప్రభావం చూపుతుంది.
రాత్రి పడుకునే ముందు ద్వారం వద్ద ఎలాంటి చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి.
వీలైతే అక్కడ చిన్న దీపం లేదా వెలుతురు ఉండేలా చూడండి.
పడకగది
పడకగదిలో మనం అమర్చుకునే వస్తువులు మన మనస్సును ప్రభావితం చేస్తాయి.
వాస్తు ప్రకారం, తల ఎప్పుడూ దక్షిణం లేదా తూర్పు వైపు ఉండేలా చూసుకోవాలి.
చాలామంది మంచం కింద పాత ఇనుప సామాన్లు లేదా చెప్పులు పెడుతుంటారు.
ఇది మెదడుపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది.
అదనపు టిప్స్
వారానికి ఒకసారి ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా కల్లు ఉప్పు వేయండి.
ఇది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటుంది.
పడుకునే గదిలో టీవీలు, మొబైల్ ఫోన్లు లేదా
పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువులను దూరంగా ఉంచండి.
ఇవి విడుదల చేసే తరంగాలు నిద్రను భంగపరుస్తాయి.
స్నానాల గది
బాత్రూం తలుపులు ఎప్పుడూ వేసి ఉంచాలి.
అక్కడ తడి లేకుండా, శుభ్రంగా ఉంచుకోవడం వల్ల
రాహు దోషాలు తొలగి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.












Click it and Unblock the Notifications