వాస్తు ప్రకారం సాయంత్రం చీపురుతో ఇంటిని శుభ్రం చేయవచ్చా?
వాస్తు శాస్త్రంలో చీపురును కేవలం దుమ్మును శుభ్రం చేసే వస్తువుగా మాత్రమే చూడరు. దానిని సాక్షాత్తు 'మహాలక్ష్మి' స్వరూపంగా భావిస్తారు. ఇంటిలోని దరిద్రాన్ని బయటకు పంపి, సిరిసంపదలను ఆహ్వానించే శక్తి చీపురుకు ఉందని పురాతన శాస్త్రాలు చెబుతున్నాయి. వాస్తు రీత్యా దీనికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. చీపురును మనం గౌరవించే విధానమే మన ఆర్థిక స్థితిని నిర్ణయిస్తుందని శాస్త్రం చెబుతోంది. చీపురు గురించి కొన్ని తప్పులు మనం తెలియక చేస్తుంటాం. కానీ అవి మనల్ని దరిద్రంలోకిన నెట్టేస్తుంటాయి. అందుకే, చీపురును వాడే విధానంపై వాస్తు నిపుణులు కొన్ని కీలక సూచనలు చేశారు. వాటి గురించి తెలుసుకుందాం.
సూర్యాస్తమయం అయ్యే సమయం లక్ష్మీదేవి ఇంటికి వచ్చే సమయంగా భావిస్తారు.
సాయంత్రం 6.00 గంటల తర్వాత ఇల్లు ఊడ్చడం వల్ల
ఇంట్లోని 'శుభ శక్తి' బయటకు వెళ్లిపోతుంది.
ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది.
ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఊడ్వాల్సి వస్తే,
ఆ చెత్తను బయట పారబోయకుండా ఒక మూలన ఉంచి,
మరుసటి రోజు ఉదయం బయట పారవేయాలి.
ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహించదని నిపుణులు చెబుతున్నారు.

చీపురును ఉంచే దిశ కూడా మన ఇంటి ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుంది.
వాస్తు ప్రకారం, చీపురును ఉంచడానికి పశ్చిమ లేదా నైరుతి దిశలు అత్యంత శుభప్రదమైనవి.
ఇలా ఉంచడం వల్ల ఇంట్లో ధనం నిల్వ పెరుగుతుంది.
మన డబ్బును బీరువాలో ఎలా దాచుకుంటామో,
చీపురును కూడా అలాగే బయట వ్యక్తులకు కనిపించకుండా దాచి ఉంచాలి.
ప్రధాన ద్వారం ఎదురుగా లేదా అందరికీ కనిపించేలా ఉంచితే
ఇంట్లోని లక్ష్మి వెనక్కి వెళ్ళిపోతుందని నమ్మకం.
పొరపాటున కూడా చీపురును కాళ్లతో తొక్కకూడదు.
దానికి తగలకుండా చూసుకోవాలి. ఇది లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది.
చీపురును ఎప్పుడూ నిలబెట్టి ఉంచకూడదు.
ఇది వాస్తు రీత్యా పెద్ద దోషం. ఎప్పుడూ పడుకోబెట్టే ఉంచాలి.
బాత్రూమ్ పక్కన లేదా చెత్త డబ్బాల దగ్గర చీపురును
ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరిగి,
అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
పాతబడిపోయిన లేదా విరిగిపోయిన చీపురును ఇంట్లో ఉంచుకోవడం దరిద్రానికి హేతువు.
పాత చీపురును పారవేయడానికి శనివారం అత్యంత అనుకూలమైన రోజు.
అలాగే, కొత్త చీపురును కూడా శనివారమే వాడటం మొదలుపెడితే
శని దోషాలు తొలగి, ఆర్థిక లాభాలు కలుగుతాయి.
మనం భోజనం చేసే ప్రదేశంలో చీపురును అస్సలు ఉంచకూడదు.
ఇలా చేయడం వల్ల ఇంట్లో అన్నపూర్ణా దేవి అనుగ్రహం తగ్గి,
తిండికి లోటు ఏర్పడే అవకాశం ఉందని వాస్తు హెచ్చరిస్తోంది.
నిర్లక్ష్యం చేయకండి. చీపురును సరైన దిశలో ఉంచి,
దానికి తగిన గౌరవం ఇవ్వడం ద్వారా మీ ఇంట్లో సానుకూల శక్తిని పెంచుకోవచ్చు.
శుభ్రత ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది.












Click it and Unblock the Notifications