స్థలం ఖాళీగా ఉందని వాడుతున్నారా? వాస్తు నియమాలున్నాయి
కొంతమంది స్థలం ఖాళీగా ఉందని వాస్తును పట్టించుకోకుండా వాడేస్తుంటారు. కానీ కొన్నికొన్ని స్థలాల్లో బరువులు పెట్టకూడదు. ముఖ్యంగా బరువు అనేది ఈశాన్య దిక్కులో ఉంటే తీవ్ర నష్టం కలుగుతుంది. నైరుతి దిక్కులో పార్కింగ్ ఉంటే వాయువ్యం వైపు నడవాల్సి ఉంటుంది. మన ఇంటికి ఎటువైపు ఖాళీ స్థలం ఉంది? లేదా ఇంట్లో ఎక్కడ ఖాళీ స్థలం ఉంది? ఏ దిక్కులో ఉంది? ఏ దిక్కులో ఉన్నదాన్ని వాడాలి? అనే వివరాలను తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తర దిక్కుల్లో మాత్రమే ఖాళీ స్థలం ఎక్కువగా ఉండాలి.
పశ్చిమం, దక్షిణ దిక్కుల్లో చాలా తక్కువగా ఉండాలి.
ఒకవేళ ఈవైపు ఖాళీ స్థలం ఉంటే ఇంటికంటే ఎక్కువ ఎత్తు ఉండాలి.
నైరుతిలో బరువైన వస్తువులుంచాలి.
ఈశాన్యంలో షెడ్లు, స్టోర్ రూమ్స్ కట్టకూడదు.

ఖాళీ స్థలంలో తోట పెంచాలనుకుంటే.. తూర్పు, ఉత్తర దిశల్లో చిన్న మొక్కలు నాటాలి.
తులసి మొక్కల్లాంటివి బాగుంటాయి.
పెద్ద పెద్ద చెట్లు పశ్చిమం, దక్షిణం వైపు ఉండాలి.
తూర్పు వైపు ఉంటే వాస్తు దోషం ఉంటుంది.
గోడలకు ఆనుకొని చెట్లు ఉండకూడదు.
ఖాళీ స్థలంలో బోర్ వెల్, బావి లేదా అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ వద్దు.
కేవలం అది ఈశాన్యం వైపు మాత్రమే ఉండాలి.
ఆగ్నేయం, నైరుతిలో నీటి గుంతలు ఉంటే ధన నష్టం కలుగుతుంది.
మురుగు నీరు ఉత్తరం లేదా తూర్పు వైపు వెళ్లాలి.
ఖాళీ స్థలంలో కార్ పార్కింగ్ కోసం షెడ్లు వేస్తుంటారు.
ఈ షెడ్లు ఇంటి ప్రధాన గోడకు తగలకుండా ఉండాలి.
పార్కింగ్ కోసం వాయువ్యం, ఆగ్నేయం ఉత్తమ దిశలు.
నైరుతిలో పార్కింగ్ ఉంటే వాహనాలు తరుచుగా మరమ్మతులు వస్తాయి.
ఇల్లు కట్టుకొనేటప్పుడు మనకు వాస్తు ఎంత ముఖ్యమూ
ఖాళీ స్థలం ఉన్నప్పుడు, వదిలేటప్పుడు కూడా వాస్తు అంతే ముఖ్యం.












Click it and Unblock the Notifications