వీధిపోటు ఉన్న ఇంట్లో అద్దెకు ఉండొచ్చా? వీధిపోటు ఇల్లు కొనొచ్చా?
వాస్తు శాస్త్రం ప్రకారం వీధిపోటు అనేది అత్యంత శక్తివంతమైన అంశం. ఇది ఒక ఇంటికి అపారమైన అదృష్టాన్ని ఇవ్వగలదు లేదంటే తీవ్రమైన కష్టాలను కూడా ఇవ్వగలదు. వీధిపోటు ఉన్న ఇంటిని కొనుగోలు చేద్దామా? వద్దా? అని కొందరు, అటువంటి ఇంట్లో అద్దెకు ఉండొచ్చా? అనే విషయంలో మరికొందరు డైలమాలో ఉంటారు. దానికి సంబంధించిన వాస్తు నియమాలు తెలుసుకుందాం.
వీధి పోటు అంటే ఏమిటి?
ఒక వీధి లేదా రోడ్డు నేరుగా వచ్చి ఇంటి గోడకు లేదా గేటుకు తగిలినట్లు ఉండటాన్ని 'వీధిపోటు' అంటారు.
ఇది ఆ ఇంటిపైకి ప్రాణశక్తిని వేగంగా పంపిస్తుంది.
ఆ శక్తి సానుకూలమా? ప్రతికూలమా? అనేది
అది ఏ దిశ నుంచి వస్తోంది? అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

అద్దెకు ఉండొచ్చా?
అద్దె ఇంటికైనా సరే, వాస్తు ప్రభావం అక్కడ నివసించే వారిపై కచ్చితంగా పడుతుంది.
ఉత్తర-వాయువ్యం, తూర్పు-ఈశాన్యం, ఉత్తర-ఈశాన్యం దిశల నుంచి వీధిపోటు ఉంటే అది చాలా మంచిది.
అటువంటి ఇంట్లో అద్దెకు ఉంటే ఆర్థికంగా పైకెదుగుతారు. పదవీ లాభం ఉంటుంది.
దక్షిణం, పడమర లేదా నైరుతి దిశల నుంచి వీధిపోటు ఉంటే అద్దెకు ఉండకపోవడమే మంచిది.
ఇది ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి లోపించడానికి కారణమవుతుంది.
వీధి పోటు ఇల్లు కొనొచ్చా?
ఇల్లు కొనడం అనేది జీవితకాల నిర్ణయం కాబట్టి, వీధి పోటు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
తూర్పు - ఈశాన్యం అయితే ఐశ్వర్యం, కీర్తి
ఉత్తర - ఈశాన్యం అయితేవ్యాపార అభివృద్ధి, సుఖం
దక్షిణ - ఆగ్నేయం మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది.
ఈ విషయంలో ఆలోచించి కొనాలి.
పడమర - వాయువ్యం అయితే పేరు ప్రఖ్యాతులు వస్తాయి.
నైరుతి అయితే ప్రమాదాలు, భారీ నష్టాలు కలుగుతాయి. అస్సలు కొనొద్దు.
ఉత్తర - వాయువ్యం అయితే అస్థిరత, కోర్టు కేసులు వెంటాడతాయి.
వీధిపోటు ఉన్న ఇల్లు కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వీధిపోటు కేవలం దిశపైనే కాకుండా, రోడ్డు వెడల్పు, ఇంటి ఎత్తుపై కూడా ఆధారపడి ఉంటుంది.
సిద్ధాంతిని సంప్రదించడం ఉత్తమం.
ఒకవేళ అశుభ వీధిపోటు ఉంటే దానికి అద్దాలు అమర్చడం,
గోడ ఎత్తు పెంచడం లేదా గేటు దిశ మార్చడం వంటి పరిహారాలు చేయవచ్చు.
కానీ ఇల్లు కొనే ముందే ఇవి సాధ్యమా? కాదా? అని చూసుకోవాలి.
అశుభ వీధిపోటు ఉన్న ఇళ్లను భవిష్యత్తులో అమ్మడం కష్ అవుతుంది.
ఈశాన్య వీధిపోటు ఉన్న ఇల్లు రాజయోగాన్ని ఇస్తుంది.












Click it and Unblock the Notifications