vastu tips: ఇంట్లో ఘర్షణలు, చిరాకులా.. అయితే టెర్రస్ మీద ఈ వస్తువులను తొలగించండి!!

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువును సరైన ప్లేస్ లో ఉంచాలి. ఏదైనా వస్తువులను సరైన స్థానాల్లో పెట్టక పోతే ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇంట్లో వస్తువులను ఉంచటానికి సరైన దిశ వాస్తు శాస్త్రం కేటాయించింది. ఇక వాటిని పట్టించుకోకుండా ఎక్కడపడితే అక్కడ వస్తువులను ఉంచడం వల్ల ఖచ్చితంగా ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇక ఫలితం సదరు కుటుంబ సభ్యుల యొక్క శాంతిని, డబ్బులు రెండింటిని దూరం చేస్తుంది. ముఖ్యంగా చాలా మంది ఇల్లంతా శుభ్రంగా పెట్టుకున్నామని, ఇంటి టెర్రస్ పైన, స్టోర్ రూమ్ లోనూ చెత్త బాగా పేరుకు పోయేలా చేస్తారు. ఇక ఇది ఏమాత్రం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

 ఇంటి టెర్రస్ పైన సామాన్లు కుప్ప పెడితే కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు

ఇంటి టెర్రస్ పైన సామాన్లు కుప్ప పెడితే కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు

ఇంటి టెర్రస్ పైన చెత్త బాగా పేరుకుపోయి వుంటే ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు ఎక్కువ జరుగుతాయి. అలాగే స్టోర్ రూమ్ లోనూ చెత్త పేరుకుపోయి ఉంటే కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. దీనివల్ల ఇంట్లో ప్రశాంతత మెల్లగా దెబ్బతింటుంది. ఈ చిన్న చిన్న విషయాల పై శ్రద్ధ చూపించకపోతే ఆ వ్యక్తి జీవితం పైన పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. అసలు టెర్రస్ పైన ఎలాంటి వస్తువులను ఉంచకూడదు అనే విషయాన్ని తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం.

ఇంటి టెర్రస్ పైన పెట్టకూడని వస్తువులు ఇవే

ఇంటి టెర్రస్ పైన పెట్టకూడని వస్తువులు ఇవే

ఇంటి టెర్రస్ పై చాలా మంది పాడైపోయిన వస్తువులను, విరిగిపోయిన వాటిని, లేదా దెబ్బతిన్న వస్తువులను పెడతారు. విరిగిపోయిన కుర్చీలు, వాడని వస్తువులను టెర్రస్ పై పోగు చేయడం వల్ల అవి ప్రతికూల శక్తులను సృష్టిస్తాయి. ఇంటి పైన పెట్టిన పాడైన వస్తువులు ఇంట్లో గొడవలు కారణమవుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విరిగిపోయిన ఫర్నిచర్, మంచాలు, కుర్చీలు తదితర వస్తువులను టెర్రస్ పైన పెట్టకూడదు

భవిష్యత్ లో వాడే వస్తువులైనా టెర్రస్ మీద పెట్టటం మంచిది కాదు

భవిష్యత్ లో వాడే వస్తువులైనా టెర్రస్ మీద పెట్టటం మంచిది కాదు


ఇక వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి పైకప్పు నుండి అనవసరమైన వస్తువులను తొలగించాలి. ప్రస్తుతం వాడని, భవిష్యత్తులో ఉపయోగించే వస్తువులను కూడా టెర్రస్ పైన పెట్టకూడదు. టెర్రస్ పైన చెత్త జమ చేస్తే వాస్తు దోషం తో పాటు పితృ దోషం కూడా కలుగుతుంది. దీంతో ఇంట్లో వాతావరణం చెడిపోతుంది. కుటుంబ సభ్యుల ఆర్థిక పురోగతి దెబ్బతింటుంది. అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇంట్లో ఉపయోగించని పాడై పోయిన వస్తువులను వెంటనే బయట పారేయాలి.

టెర్రస్ మీద ఎంత చెత్త జమ చేస్తే మన తలపై అంత భారం పెరుగుతుంది.

టెర్రస్ మీద ఎంత చెత్త జమ చేస్తే మన తలపై అంత భారం పెరుగుతుంది.

భవిష్యత్తులో ఉపయోగపడే వస్తువులనుకుంటే వాటిని కూడా టెర్రస్ పైన కాకుండా, వాటికి నిర్దేశించిన స్థలంలో పెట్టి వాటి పైన గుడ్డతో కవర్ చేసి ఉంచాలి. అంతే తప్ప ఇంట్లో వాడని ప్రతి వస్తువునీ టెర్రస్ పైన పోగు చేస్తే, అది మన నెత్తి మీద భారంగా మారుతుంది. మనకు లేనిపోని చిరాకులు కలిగించి చిక్కుల్లోకి నెడుతుంది. అందుకే టెర్రస్ ఎప్పుడూ క్లీన్ గా ఉంచుకోండి. అది ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తెస్తుంది. నెగిటివ్ శక్తులు దరి చేరకుండా చేస్తుంది.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+