ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం

గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈనెల 19వ తేదీ నుంచి మనకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది ప్రారంభమైంది. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశివారి జాతక ఫలం ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం.

సింహ రాశి

సింహ రాశి వారికి ఏప్రిల్ నెల మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొన్ని రంగాల్లో విజయం వరించినప్పటికీ, మరికొన్ని చోట్ల పరాజయం పలకరిస్తుంది. ఉద్యోగులకు వారి కార్యాలయాల్లో పనితీరు బాగుంటుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. అయితే, తోటి ఉద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది మాట తీరును అదుపులో ఉంచుకుంటే అన్నీ సమసిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. మొండి బాకీలు వసూలవుతాయి. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది.

Horoscope Predictions for these two signs Leo and Virgo for the Month of April 2026

కంటికి సంబంధించిన సమస్యలు లేదా ఉదర సంబంధిత సమస్యలు రావచ్చు. ఆహార నియమాలు పాటించడం ముఖ్యం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు జరిగినా వెంటనే సద్దుమణుగుతాయి. పరస్పరం కలిసిపోతారు. ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం పఠించి, సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం శుభప్రదంగా ఉంటుంది. అన్నివిధాలుగా కలిసివస్తుంది.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఏప్రిల్ నెల అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కావడానికి ఇదే మంచి సమయం. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. లేదంటే నష్టపోతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. షేర్ మార్కెట్ లేదా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి లాభసాటిగా ఉంటుంది. లగ్జరీ వస్తువుల కొనుగోలుకు డబ్బు ఖర్చు చేస్తారు. ఈ అలవాటును మానుకోవాలి.

మానసిక ప్రశాంతత లభిస్తుంది. అయితే, మితిమీరిన పని ఒత్తిడి వల్ల నీరసంగా అనిపిస్తుంటుంది. యోగా, ధ్యానం అలవాటు చేసుకోవడం మంచిది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. బుధవారం వినాయకుడికి గరికతో పూజ చేయడం లేదా పేద విద్యార్థులకు పుస్తకాలు దానం చేయడం వల్ల ఈ రాశివారికి ఎంతో మేలు జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+