రేపటి నుండి బుధుడి ప్రత్యక్ష సంచారంతో కుంభరాశితో సహా వీరు శ్రీమంతులు అవుతారు
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిర్దిష్ట కాలమానం ప్రకారం గ్రహాలు సంచారం చేస్తూ, అనేక రాశులలో ఇతర గ్రహాలతో కలిసి సంయోగాన్ని ఏర్పరుస్తూ శుభ యోగాలను, అశుభ యోగాలను కలిగిస్తున్నాయి. గ్రహాల రాజకుమారుడు అయిన బుధుడు త్వరలో కుంభరాశిలో తిరోగమనం నుండి ప్రత్యక్ష మార్గంలో సంచారాన్ని ప్రారంభించనున్నాడు.
ప్రత్యక్ష మార్గంలో బుధుడు.. ఈ రాశులవారికి అదృష్టం
జ్ఞాన ప్రదాత అయిన బుధుడు మార్చి 21 ఉదయం 1.02నిముశాలాకు కుంభరాశిలో ప్రత్యక్ష మార్గంలో సంచరించడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో కొన్ని రాశులవారికి ఊహించని ఆర్ధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఆయా రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం.

మేష రాశి
మేషరాశిలో 11వ ఇంట్లో బుధుడు ప్రత్యక్ష సంచారం చేయనున్నాడు. దీని ఫలితంగా మేషరాశి జాతకులు అనేక రంగాలలో ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో మేషరాశి వారు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. పనులతో తీరిక లేకుండా గడపాల్సి ఉంటుంది. ఇది మేషరాశి వారికి గణనీయమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. పురోగతికి మార్గాలను సుగమం చేస్తుంది మీరు మీ భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలను తీసుకుంటారు.
వృషభరాశి
వృషభ రాశి జాతకులు బుధుడి ప్రత్యక్ష సంచారం కారణంగా సానుకూలతలను చూస్తారు. ఈ రాశిలో దశమ గృహంలో బుధుడు ప్రత్యక్షంగా మారుతున్న క్రమంలో వృషభ రాశి జాతకులు ఆర్థిక లాభాలను పొందుతారు. ఉద్యోగాలలో విజయాలను సాధిస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెట్టుబడులు, స్టాక్ మార్కెట్, లేదా భూమికి సంబంధించిన విషయాలలో ఆర్థిక లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో గణనీయమైన లాభాలను వృషభ రాశి జాతకులు పొందుతారు.
మిధున రాశి
మిధున రాశిలో జన్మించిన వారికి అదృష్టం కలిసి వస్తుంది. బుధుడు ఈ రాశి యొక్క తొమ్మిదవ ఇంట్లో నేరుగా సంచారం చేయడం కారణంగా ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి రంగంలోనూ అపారమైన విజయాన్ని సాధిస్తారు. మిధున రాశి వారికి అనేక కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పదోన్నతులు, జీతాల పెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగ ప్రణాళికలు విజయవంతమవుతాయి ఆధ్యాత్మికత వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు.
కుంభరాశి
కుంభ రాశిలో జన్మించిన వారికి నేరుగా బుధుడు సంచరించడం ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభరాశి వారి లగ్న గృహంలో బుధుడు నేరుగా సంచారం చేస్తాడు. ఇది కుంభ రాశి వారు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని బలపరుస్తుంది. కుంభ రాశి వారు తమ నిర్ణయాలు నుండి ప్రయోజనాలను పొందుతారు. కుటుంబానికి మద్దతుగా నిలుస్తారు. వారి జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
మీనరాశి
మీనరాశిలో 12వ ఇంట్లో బుధుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలో సంచారం చేయడం ఈ రాశిలో జన్మించిన వారికి గణనీయమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఈ సమయం వీరికి పురోగతిని విజయాలను అందిస్తుంది. ఈ సమయంలో మీన రాశి వారు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications