Vastu tips: కలబందను ఇంట్లో ఈ దిక్కున పెడితే సంపద వర్షం!!
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కలబంద మొక్కను పెంచితే ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని చెబుతారు. ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించకుండా, సానుకూల శక్తి ప్రవాహాన్ని కలబంద పెంచుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలామంది కలబంద మొక్కను ఇంట్లో పెట్టుకోవడం అదృష్టమని చెబుతారు. అయితే కలబంద మొక్కను పెట్టేటప్పుడు కొన్ని వాస్తు నియమాలను పాటించాలి.
ఏ దిశలో కలబంద మొక్కను పెట్టాలి? ఏ దిశలో పెట్టకూడదు? అనే విషయాన్ని కచ్చితంగా తెలుసుకొని ఉండాలి. వాస్తు ప్రకారం ఇంట్లో కలబంద మొక్కలను నాటడం చాలా శుభప్రదం. కలబంద మొక్క కష్టతరమైన జీవితాన్ని మెరుగుపరచడం మాత్రమే కాకుండా, ప్రతి పనిలోనూ విజయాన్ని తీసుకువస్తుంది. కలబంద మొక్క నాటిన చోట ప్రేమ, శ్రేయస్సు, సంపద, ప్రతిష్ట పెరుగుతాయి.

ఈ మొక్కను ఇంట్లో నాటటానికి సరైన దిశను జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. కలబంద మొక్కను ఇంటికి తూర్పు వైపున నాటడం మంచిది. కలబందను ఇంటికి ఆగ్నేయ భాగంలో కూడా నాటవచ్చు. మీకు ఉద్యోగంలో పురోగతి కావాలంటే కలబంద మొక్కను ఇంటికి పడమర వైపున నాటాలి. కలబంద మొక్కను పొరపాటున కూడా ఇంటికి వాయువ్య దిశలో నాటకూడదని గుర్తుంచుకోవాలి.
వాస్తు ప్రకారం ఈ మొక్కను ఇంట్లో వాయువ్య దిశలో అనేక ఇబ్బందులు వస్తాయి. ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవంగా వాస్తు ప్రకారం కలబంద మొక్క పెడితే అనేక సమస్యలు తొలగిపోతాయి. కలబంద మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
ఇంటికి ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను పెంచడం వల్ల డబ్బు, ప్రమోషన్ లభిస్తాయి. ఇంటి బాల్కనీలో, గార్డెన్ లో కలబంద మొక్కను పెట్టుకుంటే ప్రతికూల శక్తులు లోపలికి ప్రవేశించకుండా ఉంటాయి. కాబట్టి కలబంద మొక్కను పెట్టుకునే విషయంలో కచ్చితంగా వాస్తు నియమాలను, ఏ దిశలో పెట్టాలి అనే విషయాలను గుర్తుంచుకోవాలి.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications