Vastu tips: ఈ 6 జంతువుల చిత్రాలు పెడితే ఇంట్లోకి మెరుపువేగంతో డబ్బు వస్తుంది
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని జంతువుల ఫోటోలు పెడితే అదృష్టం కలిసొస్తుంది. మెరుపువేగంతో ఇంటికి డబ్బు వస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని జంతువుల చిత్రాలు, లేదా బొమ్మలు శుభప్రదంగా పరిగణించబడుతుంది. ముఖ్యంగా ఆరు జంతువుల ఫోటోలను, బొమ్మలను ఇంట్లో పెట్టుకోవడం మంచిదని చెప్పబడింది.
ఇంట్లో పెట్టుకోవలసిన జంతువుల ఫోటోలు, లేదా విగ్రహాలలో ఏనుగుల జంట ముఖ్యమైనది. ఏనుగుల జంటను ఇంట్లో పెట్టుకుంటే ఆ కుటుంబం సమిష్టిగా ఉంటుంది. అంతేకాదు ఆర్థికంగా కూడా శక్తివంతంగా ఉంటుంది. ఇంట్లో పెట్టుకోవాల్సిన మరొక జంతువు ఫోటో తాబేలు. తాబేలు ఫోటోలు కానీ, తాబేలు బొమ్మను గానీ పెట్టుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తాబేలు విష్ణువు యొక్క రూపం గా పరిగణించబడుతుంది.

కాబట్టి ఇంటికి తూర్పున లేదా ఉత్తరం వైపున తాబేలును పెట్టడం మంచిదని సూచించబడింది. హంసల జంట ఫోటోలు పెట్టుకుంటే చాలా మంచిది. డ్రాయింగ్ రూమ్ లో కానీ బెడ్ రూమ్ లో గాని హంసల జంట ఫోటోలు పెడితే బాగా కలిసొస్తుందని చెప్పబడింది. ముఖ్యంగా బెడ్రూంలో హంసల జంట ఫోటో వైవాహిక జీవితాన్ని బలోపేతం చేస్తుందని చెబుతారు.

వాస్తు ప్రకారం చేపల ఫోటోలను, బొమ్మలను, లేదా నిజమైన చేపలను ఇంట్లో పెట్టుకుంటే సంపద మరియు శక్తి ఆ కుటుంబ సభ్యులకు వస్తుందని చెప్పబడింది. చేపలను శక్తికి చిహ్నం గా పరిగణిస్తారు. ఎవరి ఇంట్లో చేపలు ఉంటే ఆ ఇంట్లోకి సంపద వచ్చి తీరుతుంది.
ఇంట్లో ఆవు ఫోటోలను కానీ, బొమ్మలను కానీ పెట్టుకుంటే మంచిదని చెబుతారు. ఆవులో అందరు దేవతలు నివసిస్తారు అని చెబుతారు. కాబట్టి ఇంట్లో ఆవు విగ్రహాన్ని ఉంచుకోవడం వల్ల ఆ కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది అని, వారికి అన్ని విధాలా కలిసి వస్తుందని చెబుతారు.

ఇక ఇంట్లో పెట్టుకోవాల్సిన మరొక జంతువు ఫొటో ఒంటె. ఒంటె పోరాటానికి మరియు విజయానికి ప్రతీక. ఇంట్లో ఉన్న డ్రాయింగ్ రూమ్ లో కానీ లివింగ్ రూమ్ లో కానీ వాయువ్య భాగంలో కానీ ఒంటె ఫోటోను, బొమ్మలను గాని ఉంచడం వల్ల కలిసొస్తుందని, అనుకున్న పనులు నెరవేరుతాయని, సంపద వృద్ధి జరుగుతుందని చెబుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..!












Click it and Unblock the Notifications