వాస్తు ప్రకారం ఇంట్లో డబ్బు నిల్వ ఉండాల్సిన ప్రదేశాలు ఇవే
కొంతమందికి వాస్తు ప్రకారం ఎన్ని మార్పుచేర్పులు చేసినా కలిసిరాదు. చేతిలో డబ్బు నిలవదు. డబ్బు లేకుండా జీవితం గడవదు. ప్రతి చర్య, ప్రతి పని డబ్బుతోనే ముడిపడివుంది. డబ్బు సంపాదనే మనిషి లక్ష్యంగా మారింది. ఇటువంటి తరుణంలో చేతిలో డబ్బు నిలవాలంటే, ఇంట్లో స్థిరంగా లక్ష్మీదేవి ఉండాలంటే వాస్తు ప్రకారం కొన్ని చిట్కాలు అనుసరించాలి. వాస్తు నిపుణులు చెప్పినవి చెప్పినట్లుగా పాటిస్తే ఆర్థికంగా కలిసివస్తుంది. వాటి వివరాలను తెలుసుకొని మనం కూడా ఆచరిద్దాం.
డబ్బును ఇంటి మూలల్లో పెట్టకూడదు.
దీనివల్ల వ్యతిరేక శక్తి ప్రబలుతుంది.
ఉత్తరం లేదంటే ఈశాన్య దిశలోనే ఉంచాలి.
దీనివల్ల ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది.

చీకటిగా ఉన్న ప్రదేశంలో డబ్బును నిల్వ ఉంచితే వృద్ధి ఆగిపోతుంది.
చీకటిగా ఉండే ప్రదేశాలు వ్యతిరేక శక్తితో ఉంటాయి.
డబ్బును ఉంచే ప్రదేశంలో ఎరుపు వస్త్రం, సిట్రిన్ క్రిస్టల్ లాంటివి ఉంచాలి.
డబ్బు నిల్వ ఉండే ప్రదేశం బాత్ రూం గోడలకు ఆనుకొని ఉండకూడదు.
దీనివల్ల ఆర్థిక నష్టాలు కలుగుతాయి.
శుభ్రమైన ప్రదేశంలోనే డబ్బును దాయాలి.
లేదంటే డబ్బు చేతిలో నిలవదని నిపుణులు చెబుతున్నారు.
నైరుతి దిశలో డబ్బును ఉంచితే అశుభం.
కష్టాలు, దరిద్రం తాండవిస్తాయి.
ఉత్తర దిశలో ఉండటమే చాలా మంచిది.
ఇది కుబేరుడికి సంబంధించినది.
మీరు డబ్బులుంచే లాకరు తలుపు ఉత్తరంవైపు, ఈశాన్యంవైపు తెరుచుకునేలా చూసుకోవాలి.
ఈశాన్యంలో మనీప్లాంట్ పెంచితే ఆర్థికంగా వృద్ధి ఉంటుంది.
ఇంట్లో నీరు ఎక్కడైనా లీక్ అవుతుంటే వెంటనే మరమ్మతు చేయించండి.












Click it and Unblock the Notifications