వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vastu tips:తెలిసీ తెలీక చేసే ఈ పొరబాట్లే దరిద్రానికి హేతువులు; జాగ్రత్త!!

|
Google Oneindia TeluguNews

చాలామంది తెలిసీ తెలియక ఏవేవో తప్పులు చేస్తూ ఉంటారు. తెలిసీ తెలియక చేసే తప్పులే ఒక్కోసారి వాస్తు దోషాలకు కారణమవుతాయి. తెలిసీ తెలియక చేసే పొరపాట్లు మహా గ్రహపాట్లు గా మారి దరిద్రానికి హేతువులవుతాయి. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం కొన్ని కచ్చితంగా ఆచరించవలసిన నియమాలు ఉన్నాయి. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంటికి లేని దరిద్రం వచ్చి పడుతుంది. అటువంటి వాటిలో కొన్నింటిని ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

ఇంట్లో ఎవరు పొద్దెక్కే వరకు నిద్రపోకూడదు. బాగా పొద్దెక్కిన తర్వాత నిద్ర లేచి వాకిలి చిమ్మ కూడదు. సూర్యుని ముఖాన నీళ్లు చల్లినట్టు, అప్పుడు ఇంటి ముందు నీళ్లు చల్లకూడదు. ఇక నిద్ర లేచిన వెంటనే అద్దంలో ముఖాన్ని చూసుకోకూడదు. దువ్వెనతో తల దువ్వ కూడదు. నిద్ర లేవగానే పడుకున్న దుప్పట్లు మడత పెట్టి బెడ్ శుభ్రంగా సర్దాలి. లేదంటే దరిద్ర దేవత అక్కడ తిష్టవేసి కూర్చుంటుంది.

vastu tips: These small mistakes are the reasons for poverty; Be careful!!

ఇక ఇల్లు ఊడ్చిన చీపురు ను నిలబెట్టకూడదు. వంట గదిలో వాడే మసి బట్టలను పొద్దుపోయిన తర్వాత ఉతకకూడదు. మాసిన బట్టలు ఉతికిన తర్వాత మాత్రమే స్నానం చేయాలి. బట్టలు ఉతికిన నీళ్ళను కాళ్లపైన పోసుకోకూడదు. అలా చేస్తే దరిద్ర దేవత నేరుగా మనతో పాటు వచ్చి ఇంట్లో కూర్చుంటుంది. తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టుకుని చాలాసేపు కూర్చోకూడదు.

అన్నం తిన్న తర్వాత ఎంగిలి చేయి కడుక్కొని మళ్లీ అదే కంచం ముందు కూర్చోకూడదు. అలా చేస్తే రోగ పీడితులు అవుతారు.సంధ్యాకాలంలో భార్యాభర్తలు శృంగారం చేయకూడదు. నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు. ఆ సమయాన్ని ప్రదోషకాలం గా గుర్తించి ధ్యానం, పూజ వంటివి చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది.

సాయంత్రం 6 దాటిన తర్వాత సూది, నూనె, ఉప్పు, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకూడదు . అవి శని స్థానాలు కాబట్టి వాటిని సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటికి తెచ్చుకుంటే శనిని ఇంట్లోకి ఆహ్వానించినట్టే. కాబట్టి ఏం చెయ్యకూడదో తెలుసుకుని జాగ్రత్తగా నియమానుసారంగా ఉంటె మంచి ఫలితాలు వస్తాయి. లేదంటే దరిద్ర దేవత ఇంట్లో కాపురం చేస్తుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

English summary
Knowingly and unknowingly mistakes sometimes cause Vastu Doshas. some mistakes become great disasters and become reasons for poverty.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X