vastu tips: ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టేందుకు ఏం చెయ్యాలంటే!!

ఇంట్లో ఎంత కష్టపడినా ఎప్పటికీ మనశ్శాంతి లేదని, ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి అని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు మనశ్శాంతి కోసం, కుటుంబ శ్రేయస్సుకోసం కొన్ని వాస్తు చిట్కాలు పాటిస్తే మంచిదని చెబుతున్నారు. ఇంట్లో వాస్తు దోషాల వల్ల కలిగే ప్రతికూల ఫలితాలకు చిన్నచిన్న వాస్తు చిట్కాలను పాటిస్తే మంచిదని చెబుతున్నారు.

ఇంట్లో ప్రతికూల శక్తులను తొలగించటానికి ఈశాన్య మూలలో కలశాన్ని ప్రతిష్టించాలని, కలశాన్ని వినాయకుడి స్వరూపంగా భావించి పూజించాలని, కలశాన్ని ప్రతిష్టించి వినాయకుడిని పూజిస్తే ప్రతికూల శక్తి తొలగిపోతుందని చెప్తున్నారు. అంతేకాదు ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నట్లు గా అనిపిస్తే, ప్రతికూల శక్తిని గ్రహించే గుణం ఉప్పుకు ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇల్లు తుడిచేటప్పుడు ఉప్పునీళ్లతో తుడవడం, ఉప్పును గది నాలుగు మూలలలో పోయడం వల్ల ప్రతికూలశక్తులు పోతాయి అని చెబుతున్నారు.

Vastu tips: What to do to get rid of negative energy at home!!

ఇక నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడానికి ఇంటి ప్రవేశద్వారం వద్ద పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రం ఉంచితే మంచిదని, పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రం ఇంట్లోకి ఎటువంటి ప్రతికూలతను రానివ్వదని చెబుతున్నారు. ఇంటి ముందు పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని పెట్టుకోవడం చాలా శుభప్రదమైన, ఫలవంతమైన పరిహారం అని చెబుతున్నారు.

ఇక వాస్తు దోషం ఉంటే ఇంట్లో కర్పూరాన్ని నిత్యం వెలిగించడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పోతుందని చెబుతున్నారు. వాస్తు ప్రకారం ఇంట్లో గడియారాలను ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచాలని, అలా ఉంచితే కూడా ప్రతికూల ప్రభావాలు పోతాయి అని చెబుతున్నారు.

ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకోవడం మంచిదని చెబుతున్నారు. తూర్పు దేశం లో తులసి మొక్కను నాటడం వల్ల సానుకూల శక్తిని ఇంటికి తీసుకు వస్తుందని అతను తొలగిస్తుందని చెబుతున్నారు. ఇంట్లో సువాసనగల అగరబత్తీలు కాల్చటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు బయటకు వెళతాయి అని, ఇలా చేయడం వల్ల రాత్రి పూట మంచి నిద్ర కూడా వస్తుందని చెబుతున్నారు.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+