వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి?

వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జన్మ రాశిని బట్టి ఏ దిక్కున ఇల్లు ఉండాలి? ప్రధాన ద్వారం ఏ దిశలో ఉండాలి? అనేది నిర్ణయిస్తారు. మీ రాశికి అనుకూలమైన దిశలో ఇల్లు ఉండటం వల్ల ధనలాభం, మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని వాస్తు నిపుణులు చెబుతారు. ఒక వ్యక్తి జన్మరాశికి, వారు నివసించే ఇంటి దిశకు మధ్య బలమైన సంబంధం ఉంటుంది.

మేష రాశి, సింహ రాశి, ధనుస్సు రాశి

ఈ మూడు రాశుల వారికి తూర్పు దిశ అత్యంత శుభప్రదం.
ఈ దిశ వీరికి కొత్త ఉత్సాహాన్ని, కీర్తి ప్రతిష్టలను ప్రసాదిస్తుంది.
ఈ రాశుల వారు తూర్పు ముఖం కలిగిన ఇంట్లో నివసించడం వల్ల
రాజకీయంగా లేదా వృత్తిపరంగా ఉన్నత పదవులను అధిరోహిస్తారు.
ప్రభుత్వ సంబంధిత పనులు త్వరగా పూర్తి కావడానికి,
సమాజంలో గౌరవం పెరగడానికి ఈ దిక్కు వీరికి బాగా కలిసి వస్తుంది.

Vastu Tips Which directions are considered auspicious for house placement according to each zodiac sign

వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి

చాలామంది దక్షిణం అంటే భయపడుతుంటారు.
కానీ వాస్తు ప్రకారం వృషభ, కన్య, మకర రాశుల వారికి దక్షిణం కలిసివస్తుంది.
ఈ రాశుల వారు దక్షిణ ముఖం ఉన్న ఇంట్లో ఉంటే ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు.
వ్యాపారస్తులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ దిక్కు అపారమైన ధనలాభాన్ని ఇస్తుంది.
దక్షిణం లేదా తూర్పు దిశలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి.

మిథున రాశి, తులా రాశి, కుంభ రాశి

ఈ మూడు రాశుల వారికి పడమర దిశ అత్యంత అనుకూలమైనది.
పడమర దిశలో సింహద్వారం ఉన్న ఇల్లు వీరికి సుఖసంతోషాలను, సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది.
సాధారణంగా పడమర దిశను కొంచెం కఠినమైనదిగా భావిస్తారు.
కానీ ఈ రాశుల వారికి మాత్రం ఇది విజయాలను అందిస్తుంది.
వీరి తెలివితేటలు రాణించాలన్నా, సామాజికంగా మంచి గుర్తింపు రావాలన్నా పడమర దిక్కు ఇల్లు వీరికి శ్రేయస్కరం.

కర్కాటక రాశి, వృశ్చిక రాశి మీన రాశి

ఈ రాశుల వారికి కుబేర స్థానమైన ఉత్తరం ఎంతో అదృష్టాన్ని కలిగిస్తుంది.
ఉత్తర ముఖం ఉన్న ఇంట్లో నివసించడం వల్ల వీరికి ఎప్పుడూ ధనానికి లోటు ఉండదు.
కుటుంబంలో శాంతి, సౌఖ్యాలు వెల్లివిరుస్తాయి.
చదువుకునే పిల్లలకు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు,
మేధోపరమైన పనులు చేసేవారికి ఉత్తర దిశ ఇల్లు కెరీర్ పరంగా గొప్ప ఎదుగుదలను ఇస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+