వాస్తు ప్రకారం మీరున్న ఇంటిని బావిని పూడ్చి కట్టారని తెలిస్తే?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి కింద పాత బావులు లేదా గోతులు ఉండటం అనేది చాలా ముఖ్యమైన అంశం. గతంలో బావులు ఉండి వాటిని సరిగ్గా పూడ్చకుండా ఇల్లు నిర్మిస్తే, అది ఆ ఇంట్లో నివసించే వారిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంటిని అమ్మేవారు, స్థలం అమ్మేవారు ఆ విషయాన్ని చెప్పకుండా దాచిపెడతారు. అయితే స్థలమైనా, ఇల్లు అయినా ఈ విషయం తెలుసుకొని కొనుగోలు చేయడం మంచిదని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇంటి ఆవరణలో బావి ఎక్కడ ఉందనేది ముఖ్యం.
ఇల్లు నిర్మించిన తర్వాత ఆ బావి ఇంటి లోపలి భాగంలోకి వస్తే
ఈశాన్యం దిశలో ఉంటే అది శుభప్రదంగా.
అయితే అది ఇంటి స్లాబ్ కింద కాకుండా విడిగా ఉంటేనే మంచిది.

నైరుతి లేదా ఆగ్నేయం దిశల్లో పాత బావులు ఉండి,
వాటిని పూడ్చేసి ఇల్లు కడితే ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ముఖ్యంగా నైరుతిలో గొయ్యి ఉండటం చాలా అరిష్టంగా భావిస్తారు.
బావిని కేవలం మట్టితో నింపేయడం వాస్తు ప్రకారం మంచి నిర్ణయం కాదు.
పాత బావులను పూడ్చేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి.
ముందుగా బావిలోని నీటిని పూర్తిగా తోడేయాలి.
అందులో ఉన్న బురదను తీసివేసి, శుద్ధి చేయాలి.
ఆ తర్వాత రాళ్లు, ఇసుక, మట్టితో క్రమ పద్ధతిలో నింపాలి.
తర్వాత శాంతి పూజలు చేయించడం ఉత్తమం.
ఇలా చేయడం వల్ల ఆ భూమిలోని 'శూన్య శక్తి' తొలగిపోతుందని నమ్మకం.
మీరు ఉంటున్న ఇంటి కింద బావి ఉందని మీకు అనుమానం
వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదు.
దీనికి కొన్ని నివారణలున్నాయి.
నైరుతిలో ఉందని తెలిస్తే భారీ వస్తువులు ఉంచాలి.
ఆ ప్రాంతంలో రాగి తీగలు, వాస్తు పిరమిడ్లను భూమిలో పాతాలి.
దీనివల్ల ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి.
పునాదులు వేసే ముందే భూమిని పరిశీలించడం ఎప్పుడూ మంచి నిర్ణయం.
మీరు ఉంటున్న ఇంట్లో అనవసరమైన భయాందోళనలు, పదే పదే ఆరోగ్య సమస్యలు వస్తుంటే
తప్పకుండా ఒకసారి వాస్తు నిపుణుడిని సంప్రదించాలి.
భూమి లోపల ఏవైనా దోషాలు ఉన్నాయేమో తెలుసుకొని పరిష్కరించుకోవాలి.
-
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే!











Click it and Unblock the Notifications