నవంబర్లో 5సార్లు శుక్రుడి స్థానమార్పుతో వీరికి పట్టిందల్లా బంగారం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. వివిధ రాశులలోకి గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను తీసుకువస్తుంది. నవంబర్ మాసంలో శుక్రుడు సంచారం చేయనున్నాడు. శుక్రుడు సంపదలకు విలాసాలకు ప్రేమకు ధనానికి ప్రతినిధి. అటువంటి శుక్ర సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆయా రాశుల వారు శుక్రుడి కారణంగా సంపదలతో తులతూగుతారు.

నవంబర్లో ఐదుసార్లు స్థానాన్ని మార్చుకుంటున్న శుక్రుడు
నవంబర్లో శుక్రుడు ఐదుసార్లు తన స్థానాన్ని మార్చుకుంటున్నారు . నవంబర్ రెండవ తేదీన శుక్రుడు తన సొంతరాశి అయిన తులారాశిలోకి సంచరిస్తాడు. శుక్రుడు నవంబర్ 7వ తేదీన స్వాతి నక్షత్రంలో అడుగు పెడతాడు. నవంబర్ 13వ తేదీన విశాఖ నక్షత్రంలోకి వెళతాడు. ఆపై నవంబర్ 26వ తేదీన వృశ్చిక రాశిలోకి వెళతాడు. నవంబర్ 29న అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఇలా అయిదుసార్లు శుక్రసంచారం కొన్ని రాశులవారికి మంచి ఫలితాలను ఇస్తుంది.

Venus changing positions 5 times in November golden life to these zodiac signs

వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు శుక్ర సంచారం కలిసివస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి జాతకులు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ రాశి వారికి ఎప్పటినుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది. ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. కోర్టు కేసులలో విజయాలను సాధిస్తారు.

సింహరాశి
సింహరాశి జాతకులకు శుక్ర సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కలుగుతుంది. విదేశాలలో పనిచేసే వారికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పూర్వీకుల నుండి ఆస్తులు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.

మకర రాశి
మకర రాశి వారికి నవంబర్ నెల బాగా కలిసి వస్తుంది. శుక్ర సంచారం కారణంగా మకర రాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు. ఈ సమయంలో మకర రాశి వారు ఏ పని చేసిన విజయాలను సొంతం చేసుకుంటారు. ఉద్యోగంలో సానుకూల మార్పులను చూస్తారు. భూములు, ఆస్తులకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. రాజకీయాలలో ఉన్నవారికి ఇది మంచి సమయం. పిల్లలు చదువులకు, ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు.

Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+