కర్కాటక రాశిలో శుక్రుడు ప్రత్యక్షం: ఈ రాశుల వారికి అంతా శుభం!!
కర్కాటక రాశిలో శుక్రుడు ప్రత్యక్షంగా మారడం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ప్రతినెల శుక్రుడు ఒక రాశి నుండి మరొక రాశికి బదిలీ అవుతాడు. ఒకరాశిలో శుక్ర సంచారం దాదాపు 30 రోజుల నుండి 36 రోజులపాటు కొనసాగుతుంది. అయితే ఈసారి శుక్రుడు సెప్టెంబర్ 4వ తేదీ ఉదయం 6:17 నిమిషాలకు కర్కాటక రాశిలో ప్రత్యక్షంగా మారుతాడు.
కర్కాటక రాశిలో శుక్రుడు ప్రత్యక్షంగా మారడం మిధున రాశి, కన్యా రాశి, కర్కాటక రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశిలో శుక్రుడు ప్రత్యక్షంగా మారడం వల్ల మిధున రాశి జాతకులకు మేలు జరుగుతుంది. ఈ సమయంలో వీరు బాగా డబ్బు సంపాదించడానికి ఎక్కువ అవకాశాలను కలిగి ఉంటారు.

జీవిత భాగస్వామి విషయంలోను సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇది మిధున రాశి జాతకులకు ఉత్తమ సమయం. ఈ సమయంలో మిధున రాశి జాతకులు శృంగార సంబంధాలకు, ప్రేమకు సంబంధించి సానుకూలమైన ఫలితాలను పొందుతారు. వీరు ఏదైనా కొత్త పని ప్రారంభించాలంటే ఇది వారికి అనుకూల సమయంగా చెప్పొచ్చు.
కర్కాటక రాశిలో శుక్రుడు ప్రత్యక్షంగా మారడం వల్ల కన్యారాశి జాతకులకు లబ్ధి చేకూరుతుంది. కన్యారాశి జాతకులు ఈ సమయంలో జీవిత భాగస్వామితో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తారు. జీవిత భాగస్వామి నుండి వీరికి సంపూర్ణమైన మద్దతు లభిస్తుంది. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఈ సమయంలో కన్య రాశి వారు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు.
.కర్కాటక రాశిలో శుక్రుడు ప్రత్యక్షంగా మారడం వల్ల కర్కాటక రాశి వారికి ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. కర్కాటక రాశి వారు ఈ సమయంలో కుటుంబ అవసరాలను తీర్చడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. భూమి, వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేయడానికి కర్కాటక రాశి వారికి ఇది సరైన సమయం. సామాజికంగా మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఈ సమయంలో కర్కాటక రాశి వారు సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications