త్వరలో వీరికి విలాసాలు, రాజభోగాలు.. పండుగ చేసుకోమన్న శుక్రుడు!
శుక్రుడు సంపదలను ఇచ్చే గ్రహం. విలాసాలకు సంపదలకు అధిపతి అయిన శుక్ర గ్రహం నిర్దిష్ట సమయంలో రాశులను అలాగే నక్షత్రాలను మారుస్తూ ఉంటాడు. ఇక శుక్రుడు డిసెంబర్ 11వ తేదీన శ్రవణా నక్షత్రంలోకి సంచారం చేయబోతున్నాడు. శుక్రుడు శ్రవణా నక్షత్రంలో రెండవ ఇంటికి అధిపతి.
శ్రవణా నక్షత్రంలో శుక్రుడు
శ్రవణా నక్షత్రం చంద్రుడు, శని మరియు శుక్రుడుతో ప్రభావితమయ్యే నక్షత్రం. ఇక అటువంటి శ్రవణా నక్షత్రంలోనికి శుక్ర సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో వారికి ఆర్ధిక ప్రయోజనాలు కలుగుతున్నాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభరాశి
శ్రవణా నక్షత్రంలో శుక్ర సంచారం వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వృషభ రాశి వారి జీవితంలో ఇప్పుడు సానుకూల మార్పులు వస్తాయి. వృషభ రాశి వారు ఆర్థికంగా స్థిరపడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి ఆదాయాన్ని పొందుతారు. వీరి వర్తక వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి శుక్రుడి నక్షత్ర సంచారం బాగా కలిసి వస్తుంది.
తులారాశి
సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు శ్రవణా నక్షత్రంలో సంచరించడం తులా రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు వర్తక వ్యాపారాలలో మంచి రాబడిని పొందుతారు. పెట్టిన పెట్టుబడులు ప్రయోజనాలను ఇస్తాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. తులా రాశి వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ఇది తులా రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చే శుభ సమయం.
మకర రాశి
శుక్రుడి సంచారం మకర రాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. శుక్ర సంచారం కారణంగా మకర రాశి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆర్థికంగా ఇప్పుడు స్థిరత్వాన్ని సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. వివాహితులకు ఈ సమయంలో శుభవార్తలు అందుతాయి. ముఖ్యంగా ఈ సమయం వ్యాపార వర్గాల వారికి అదృష్ట సమయంగా మారుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications