కర్కాటకరాశిలో శుక్రుడి ఉదయం... నేటినుండి వీరి బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలు

వేద జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. శుక్రుడు లగ్జరీలకు ప్రతీకగా నిలిచే గ్రహం. శుక్రుడిని స్త్రీ లింగ అంశాల గ్రహంగా కూడా పరిగణిస్తారు. అయితే శుక్రుడు చంద్రుని రాశి అయిన కర్కాటక రాశిలో ఉన్న కారణంగా శుక్రునికి కర్కాటక రాశి శత్రు రాశి కారణంగా కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయి. మరికొన్ని రాశుల వారు అనుకూలమైన ఫలితాలను కూడా పొందుతారు.

నేడే శుక్రుడి ఉదయం
అయితే నేడు ఉదయం 7 గంటల 59 నిమిషాలకు కర్కాటక రాశిలో శుక్రుడు ఉదయిస్తున్నాడు. కర్కాటక రాశిలో శుక్రుడి ఉదయం కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు వ్యాపారంలో తిరుగులేని లాభాలను పొందుతారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

Venus rise in Cancer sign These zodiac signs business gives wealth and luck

మేషరాశి
కర్కాటక రాశిలో శుక్రుడు ఉదయం కారణంగా మేషరాశి జాతకులకు బిజినెస్ లో కలిసొస్తుంది. మేషరాశి వారికి రెండవ మరియు ఏడవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు ఇప్పుడు నాలుగో ఇంట్లో ఉదయిస్తున్నాడు. ఈ కాలంలో మేష రాశి జాతకులకు వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఈ సమయంలో మీ తెలివితేటలు మీ బిజినెస్ ను వృద్ధి చేసుకోవడానికి పనికొస్తాయి.

వృషభ రాశి
కర్కాటక రాశిలో శుక్రుడు ఉదయం వృషభ రాశి జాతకులకు వ్యాపారంలో లాభాలను తెస్తుంది. వృషభ రాశిలో శుక్రుడు మొదటి మరియు 6వ ఇంటిని పరిపాలిస్తాడు. ప్రస్తుతం శుక్రుడు మూడవ ఇంట్లో ఉదయిస్తున్నాడు. దీనివల్ల మీరు బిజినెస్ లో విజయం సాధిస్తారు. వ్యాపారాలకు సంబంధించి చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

కన్యా రాశి
కన్యారాశిలో రెండవ మరియు తొమ్మిదవ ఇంటికి పాలక గ్రహంగా శుక్రుడు ఉంటాడు. అయితే ఇప్పుడు శుక్రుడు 11 వ ఇంట్లో ఉదయిస్తున్నాడు. దీని ఫలితంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి సరైన సమయం. వర్తక వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో లాభాలను ఆర్జిస్తారు. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది.

తులారాశి
తులా రాశిలో శుక్రుడు మొదటి మరియు ఎనిమిదవ ఇంటిని పాలిస్తాడు. ప్రస్తుతం పదవ ఇంట్లో శుక్రుడు పెరుగుతున్నాడు. ఈ సమయంలో తులా రాశి జాతకులు పని విషయంలో జాగ్రత్తగా వ్యవహరించి అపారమైన విజయాలను పొందుతారు. వ్యాపారస్తులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఇది వారికి చాలా సంతృప్తిని ఇస్తుంది.

మకర రాశి
శుక్రుడు మకర రాశిలో ఐదవ మరియు పదవ ఇంటికి అధిపతిగా ఉంటాడు. ప్రస్తుతం శుక్రుడు ఏడవ ఇంట్లో ఉదయిస్తున్నాడు. ఈ సమయంలో మకర రాశి వారు వృత్తి వ్యాపారాలలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో చేసే వ్యాపార పర్యటనలు లాభాలను ఇస్తాయి. పెద్ద వ్యాపార ఒప్పందాలను కూడా ఈ సమయంలో చేసుకునే అవకాశం ఉంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+