మే 31న వ్యతిపాత యోగం.. ఈ రాశుల వారికి తీవ్ర నష్టాలు, ప్రమాదాలు!!

విపత్తును, దుఃఖాన్ని తీసుకువచ్చే వ్యతిపాత యోగం మే 31 వ తేదీన ఏర్పడుతుంది. మొత్తం 27 యోగాలలో వ్యతిపాత యోగం 17వ యోగం. ఇది చాలా అ శుభయోగం. ఈ యోగం నాడు ఎవరైనా కొత్త పనిని ప్రారంభిస్తే వారు ఖచ్చితంగా ప్రతికూలతను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ యోగం ఉంటే ఏ పని చేసినా దురదృష్టం వెంటాడుతుంది. అనారోగ్యం కలుగుతుంది. దుఃఖం అనివార్యంగా మారుతుంది.

వ్యతిపాత యోగానికి రుద్రుడు దేవత. ఈ యోగం సమయంలో కొందరి జాతకం పై ప్రతికూల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. వ్యతిపాత యోగం ప్రమాదాల బారిన పడేలా చేస్తుంది. మే 31వ తేదీన వస్తున్న ఈ యోగం వల్ల నాలుగు రాశుల వారికి పరిస్థితులు దారుణంగా మారబోతున్నాయి. మేష రాశి, కర్కాటక రాశి, కన్య రాశి, వృశ్చిక రాశి జాతకులు వ్యతిపాత యోగం కారణంగా బాధపడాల్సి రావచ్చని చెబుతున్నారు.

Vyatipatha Yoga

వ్యతిపాత యోగం వల్ల మేష రాశి జాతకులు ధనాన్ని కోల్పోయే అవకాశం ఉంది. నమ్మిన వాళ్లతోనే మోసపోయే అవకాశం ఉంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొని, తీవ్ర మనస్థాపానికి గురవుతారు. ఈ జాతకుల తల్లి అనారోగ్యానికి గురయ్యే సూచన ఉంది. చిన్న చిన్న సమస్యల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంట్లో దొంగతనాలు జరిగే ప్రమాదముంది. కనుక ఈ సమయంలో కచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వృశ్చిక రాశి జాతకులు వ్యతిపాత యోగం కారణంగా ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఈ సమయంలో వ్యాపారాలలో ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా జాగ్రత్త వహించండి. వ్యతిపాత యోగం వల్ల అనారోగ్యం కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. మానసిక ప్రశాంతతకు భంగం కలిగే అవకాశం కూడా ఉంది.

కన్య రాశి జాతకులు వ్యతిపాత యోగం కారణంగా కుటుంబ సభ్యులతో వివాదాల్లో ఇరుక్కుంటారు. వ్యాపారాలలో నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. వ్యతిపాత యోగం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి వ్యాపార అగ్రిమెంట్ ల పైన సంతకాలు పెట్టకూడదు. వ్యాపారంలో పార్ట్నర్ లు మోసం చేసే అవకాశం ఉంది. ఇంట్లో ఆహ్లాదకర వాతావరణం ఉండదు. ఆర్థిక నష్టాలు, దొంగతనాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది.

వ్యతిపాత యోగం కారణంగా కర్కాటక రాశి జాతకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉంది. అనవసరమైన ఆఫీసు రాజకీయాలలో వీరు బలి అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి కర్కాటక రాశి జాతకులు వ్యతిపాత యోగం సమయంలో అప్రమత్తంగా ఉండాలి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+