ఎంత ఒత్తిడివున్నా ధర్మమార్గాన్ని వదలొద్దు.. 16 నుంచి 22 వరకు రాశిఫలాలు
జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు, 27 నక్షత్రాల గురించి పూర్తిగా చెబుతారు. నిర్దిష్ట సమయం తర్వాత గ్రహాలు తమ రాశులను మారుస్తుంటాయి. ఈనెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు వివిధ రాశులవారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
మేషరాశి
మంచి సమయం. మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులపై వారి పై అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఇంట్లో, బయట కలిసివస్తుంది. లక్ష్మీకటాక్ష సిద్ధి ఉంది. వ్యాపార యోగం బాగుంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది. శుభవార్త వింటారు. శివుణ్ని ఆరాధించాలి.

వృషభరాశి
వృషభరాశివారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అవసరాలకు సరిపడా ధనం చేతికందుతుంది. ఉద్యోగస్తులు మానసిక ప్రశాంతతో ఉండాలి. ఎంత ఒత్తిడి ఎదురవుతున్నప్పటికీ ధర్మమార్గంలోనే బాధ్యతలను నిర్వర్తించాలి. దీనికోసం తోటి ఉద్యోగుల సహకారం తీసుకోవాలి. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలను మార్చుకుంటూ ఉండాలి. సమష్టిగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. వివాదం రేకెత్తడానికి అవకాశం ఉంది. నవగ్రహ శ్లోకాలను చదువుకోవాలి.
మిథునరాశి
ఈ వారంలో వీరు ఆశించిన ఫలితాలు వెంటనే కలుగుతాయి. ఏ పని చేయడానికైనా మనోబలం ముఖ్యం. ఉద్యోగస్తులకు బాగుంది. కర్తవ్యనిష్టతో విధులు నిర్వహిస్తే బ్రహ్మాండమైన విజయం సాధిస్తారు. ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు బాగుంది. అదృష్టయోగం కనపడుతోంది. ప్రశాంతంగా జీవిస్తారు. లక్ష్మీదేవిని స్మరించాలి.
కర్కాటకరాశి
లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఏ పని చేసినా పట్టుదలతో చేయాలి. అప్పుడే విజయం వరిస్తుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఈ వారం చాలా మిశ్రమంగా ఉంది. నిర్ణయాలు తీసుకునేముందు గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఒకటి అనుకుంటే మరొకటి జరుగుతుంది. అప్పులు చేయవద్దు. ప్రయాణాల్లో ఆటంకాలేర్పడతాయి. పనిలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. నవగ్రహ శ్లోకాలను చదువుకోవాలి.
సింహరాశి
ఆస్తి వృద్ధి చెంది ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. ఉద్యోగస్తులకు మంచి ఫలితాలున్నాయి. క్రమంగా వారు పైపైకి వస్తారు. అనుకున్నది సాధించాలంటే నిరంతర కృషి ఒక్కటే మార్గం. ఎదురుచూస్తున్న పనిలో అడుగు ముందుకు పడుతుంది. సుఖసంతోషాలున్నాయి. గురువుల అనుగ్రహం ఉంది. పదిమందికి ఆదర్శంగా నిలిచే జీవితమవుతుంది. విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.
కన్యారాశి
ఈ వారంలో వీరు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. ఉద్యోగం బాగుంటుంది. గందరగోళ పరిస్థితి నుంచి బయటకు వస్తారు. ఇప్పటివరకు స్పష్టతలేని విషయాల్లో పూర్తి స్పష్టతకు వస్తారు. వివాదాలకు అవకాశం ఇవ్వొద్దు. వ్యాపారస్తులకు బాగుంది. శ్రద్ధగా ప్రణాళిక అమలుచేస్తే విజయం సాధిస్తారు. పేరు ప్రతిష్టలు కలుగుతాయి. ఇష్టదేవతను స్మరించడంవల్ల అదృష్టవంతులవుతారు.












Click it and Unblock the Notifications