వారఫలాలు: ఆర్థికంగా కలిసిరాబోతోంది.. ఇష్టదైవాన్ని ప్రార్థించాలి
గ్రహాలు నిర్దేశిత సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచరిస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశుల వారికి అనుకూల ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశులవారికి ప్రతికూల ప్రయోజనాలు కలుగుతాయి. 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రాశులవారికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఎలా ఉంది? ప్రతికూలతలుంటే వాటిని అధిగమించడానికి ఏ చర్యలు చేపట్టాలి?.. తదితర విషయాల గురించి తెలుసుకుందాం.
మేషరాశి : ఉద్యోగంలో శ్రద్ధ పెట్టాలి. సరైన నిర్ణయాలు సమయానుకూలంగా తీసుకోవాలి. నిందలు వేసేవారున్నప్పటికీ భయపడొద్దు. మొండితనం లేకుండా పట్టవిడుపులతో వ్యవహరించండి. అనుకున్న లక్ష్యాలను దృఢ సంకల్పంతో పూర్తిచేయాలి. వారాంతంలో శుభం జరుగుతుంది. సూర్యుడిని ఆరాధించండి.

వృషభరాశి : అధికార యోగం కనపడుతోంది. పలు మార్గాల్లో విజయం ఉంది. శుభకాలం కావడంతో ముఖ్యమైన పనుల్లో గెలుపొందుతారు. సకాలంలో తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్దేశిస్తాయి. వ్యాపారంలో అనుకున్న ఫలితాలు వస్తాయి. విష్ణుసహస్ర నామ పఠనం చేయడం మంచిది.
మిథునరాశి : వ్యాపార యోగం బాగుంది. కాలం కూడా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా కలిసిరానుంది. ఇబ్బందులు తొలగిపోతాయి. సరైన నిర్ణయాలు తీసుకొని అందుకు అనుగుణంగా మంచి ఫలితాలు సాధించాల్సి ఉంటుంది. ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరతాయి. భూమి, ఇల్లు, వాహన యోగాలున్నాయి. పెట్టుబడులు లాభాలను తెస్తాయి. ఇష్టదైవాన్ని ప్రార్థించడంవల్ల శ్రేయస్సు పెంచుతుంది.
కర్కాటక రాశి : ఆర్థికంగా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల్లో సకాలంలో పనులు పూర్తిచేయాల్సి ఉంటుంది. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యకు దారితీస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. గ్రహ దోషం కనపడుతోంది. ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేయాల్సి ఉంటుంది. భవిష్యత్తు బాగుంటుంది. నవగ్రహ శ్లోకాలు పఠించడంవల్ల మేలు కలుగుతుంది.
సింహ రాశి : వ్యాపారంతోపాటు వృత్తి, ఉద్యోగంలో శుభయోగాలు కనపడుతున్నాయి. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని నడిపిస్తుంది. పదవీ యోగం కనపడుతోంది. గుర్తింపు లభిస్తుంది. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవాలి. కుటుంబ సభ్యులతో సంతోషకరంగా గడుపుతారు. ఇష్టదైవాన్ని స్మరించాలి.
కన్యారాశి : పనిచేసే విషయంలో ధర్మాన్ని మరవకూడదు. ఎవరితోను వివాదాలు వద్దు. కాలాన్ని సద్వినియోగం చేయండి. మనసుకు ఏదీ పట్టించుకోవద్దు. ఆపదలు తొలగిపోతాయి. స్నేహితుల సూచనలు ఆదుకుంటాయి. వ్యాపారంలో కొత్తదనం చూపించాలి. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల శాంతి కలుగుతుంది.












Click it and Unblock the Notifications