ఇష్టదేవతను స్మరించండి.. బ్రహ్మాండమైన యోగం ఉంది

రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఈ వారంలో ఎటువంటి ఫలితాలు ఎదురవుతున్నాయి? చిన్న చిన్న సమస్యలుంటే వాటిని ఎలా పరిష్కరించుకోవాలి? కలిసి రావడానికి జ్యోతిష్య పండితులు చెప్పినట్లుగా ఏం చేయాలి? తదితర వివరాలను ఈ వారం రాశిఫలాల్లో తెలుసుకోవచ్చు. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైతే వాటిని ఎలా అధిగమించాలో సూచిస్తున్నారు. ఈనెల 26వ తేదీ నుంచి డిసెంబరు 2వ తేదీవరకు రాశులవారీగా ఫలితాలను తెలుసుకుందాం.

మేషరాశి
పనులు సకాలంలో పూర్తిచేయాలి. నిర్ణయాలన్నీ ఆత్మవిశ్వాసంతో తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా చూడాలి. కాలాన్ని వృథా చేయవద్దు. ఆలోచించి ఖర్చు చేస్తారు. ఇష్టదేవతను దర్శించడంవల్ల మనసుకు శాంతి లభిస్తుంది.

weekly horoscope from novermber 26th to december 2nd 2023

వృషభరాశి
ఎక్కువ గ్రహాలు దోషస్థానంలో ఉన్నాయి. వీటివల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. నిర్ణయాలు ఎలాపడితే అలా తీసుకోకూడదు. ఆలోచించాలి. ఆత్మీయుల సూచనలు అవసరం. చెడును ఊహించొద్దు. ఇష్టదేవతను స్మరించడంవల్ల మేలు కలుగుతుంది.

మిథునరాశి
ఇది మంచికాలం. ఆపద నుంచి త్రుటిలో బయటపడతారు. వాహన, భూమి, గృహ యోగాలున్నాయి. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంది. లక్ష్మీదేవిని స్మరించాలి. గతంలో కాని పనులు కూడా ఇప్పుడు పూర్తవుతాయి.

కర్కాటకరాశి
కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విశేష ధనయోగం ఉంది. ఏ విషయాన్ని మనసుకు పట్టించుకోవద్దు. కాలం మిశ్రమంగా ఉంది. మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది. పనిని ప్రారంభించిన తర్వాత మార్చకూడదు. ఇష్టదేవతను స్మరించడంవల్ల శుభవార్తను వింటారు.

సింహరాశి
వ్యాపార యోగం బాగుంది. అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారంలో అంచెలంచెలుగా పైకి చేరుకుంటారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అభద్రతా భావం వద్దు. గొడవలకు దూరంగా ఉండాలి. ఇష్టదేవతను స్మరిస్తే మేలు కలుగుతుంది.

కన్యారాశి
ఉద్యోగంలో ఉన్నత స్థితి కనపడుతోంది. అభివృద్ధికి బాటలు పడతాయి. కొత్త ప్రయత్నాలు విజయవంతమవుతాయి. సాహసంతో తీసుకునే నిర్ణయాలు లాభాన్నిస్తాయి. వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడంవల్ల మేలు కలుగుతుంది. ఇష్టదేవతను దర్శించడంవల్ల శుభవార్త వింటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+