ఇష్టదైవాన్ని స్మరించాలి... బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంది

గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలోకి నిర్ధేశిత సమయంలో పయనిస్తుంటాయి. ఇలా పయనించే క్రమంలో కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలేర్పడతాయి. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఈనెల 22వ తేదీ నుంచి 28వ తేదీ వరకు లా ఉంది? కలిసి వస్తుందా? బాగోలేకపోతే అందుకు ఏం చేయాలి? తదితర విషయాలను తెలుసుకుందాం.

మేష రాశి: ఆత్మవిశ్వాసంతో పనిచేయడంవల్ల అనుకున్నది సాధిస్తారు. వర్తమానంలో తీసుకునే నిర్ణయాలే మంచి భవిష్యత్తును ఇస్తాయి. శత్రు దోషాలు తొలగిపోతాయి. మిత్రుల బలం పెరుగుతుంది. వ్యాపార పరంగా మిశ్రమంగా ఉండటంతో జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది. శివుణ్ని ఆరాధించాలి.

weekly horoscope from october 22nd to 28th

వృషభరాశి: కొత్తగా చేసే ప్రయత్నాలద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ధి ఉంది. వ్యాపారంలో లాభాలున్నాయి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యూహరచన చేసుకోవాలి. కార్యాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు సకాలంలో పనులు ప్రారంభించడంతోపాటు అధికారులతో చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

మిథున రాశి: కాలం మిశ్రమంగా ఉంది. ముఖ్యమైన పనుల విషయంలో ఎంతో శ్రద్ధ అవసరం. సందేహం వదిలిపెట్టాలి. నిర్ణయాలు ధైర్యంగా తీసుకోవాలి. ఒత్తిడితో పనిచేయవద్దు. మౌనంగా ఉండటం కలిసివస్తుంది. కొన్ని సమస్యలను పరిష్కరిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. సూర్యనారాయణమూర్తిని స్మరించాలి.

కర్కాటక రాశి: ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి. కొత్తగా చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే ధనలాభాన్ని కలిగిస్తాయి. స్థిరాస్తి వృద్ధి చెందడంతోపాటు వాహన, భూమి యోగాలున్నాయి. లక్ష్మీధ్యానం ఎంతో శుభప్రదం.

సింహరాశి: అదృష్టం తోడుంటుంది. కొన్ని విషయాల్లో పూర్తి స్పష్టత వస్తుంది. నిజాయితీగా ఉండటంవల్ల అది మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. గతంలోకాని పనులు ఇప్పుడు అవుతాయి. అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. ఇష్టదైవాన్ని స్మరించాలి.

కన్యా రాశి: వ్యాపారంలో లాభాలున్నాయి. ఆర్థికంగా బలపడతారు. ఎవరినీ తక్కువ అంచనా వేయవద్దు. సొంత విషయాలను బయటివారితో చర్చించకూడదు. దీనివల్ల అభద్రతా భావానికి గురవుతారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత అడుగు వెనక్కి పడకూడదు. ఉద్యోగంలో పనులు వాయిదా వేయొద్దు. ఇష్టదైవాన్ని స్మరించడంవల్ల ఆటంకాలు తొలగిపోతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+