రేపటి నుంచి ఈ రాశులవారు పట్టుకున్నదల్లా ప్లాటినమే
రేపటి నుంచి జులై మూడోవారం ప్రారంభం కాబోతోంది. ఇది ఎంతో శుభప్రదమైన వారం. కన్యారాశిలోకి కేతువు, శుక్రుడు ప్రవేశిస్తున్నారు. అలాగే ఎల్లుండి నుంచి సూర్యుడు కర్కాటక రాశిలోకి, 19న బుధుడు సింహరాశిలోకి సంచారం చేయబోతున్నారు. ఈ ప్రభావం అన్ని రాశులవారిపై ఉన్నప్పటికీ ప్రత్యేకంగా కొన్ని రాశులవారికి మాత్రం అన్నీ శుభ పరిణామాలే ఎదురవుతున్నాయి. ఏయే రాశులవారికి, ఏవిధంగా కలిసివస్తుందో తెలుసుకుందాం.
మేషరాశి
ఈ వారం రోజులు వీరికి ఆర్థికంగా ఎటువంటి సమస్య ఎదురవదు. ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు కలుగుతాయి. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందుతారు. వ్యాపారస్తులకు అంతా అనుకూలంగా ఉంది. ఆశించిన ఫలితాలు పొంది వాటితో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగస్తులకు సీనియర్ల నుంచి మద్దతు లభించడంతోపాటు మంచి పేరును సంపాదిస్తారు. ప్రేమ జీవితంలో ఉన్నవారు మాధుర్యాన్ని అనుభవిస్తారు.

వృషభ రాశి
పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమవుతాయి. అదృష్టం తోడుండటంవల్ల పనులన్నింటినీ సులువుగా పూర్తిచేస్తారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ వారం ఎంతో మంచిది. వ్యాపారస్తులు తమ వ్యాపారంపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాలి. దీనివల్ల పెద్దమొత్తంలో ఆర్థికంగా లాభాలు కలుగుతాయి. భార్యతో ఉన్న సమస్యలు పరిష్కారమవడంతోపాటు అన్యోన్యంగా ఉంటారు.
కర్కాటక రాశి
ఆకస్మిక ధనలాభం ఉంది. పనుల్లో ఆటంకాలుంటాయి. ఆందోళన లేకుండా పనులు పూర్తిచేయాలి. ఆత్మవిశ్వాసంతో కఠినమైన పరిస్థితుల్లోను గొప్పగా ముందుకు పయనిస్తారు. వ్యాపారస్తులు మాత్రం ఎంతో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే నష్టాలపాలవుతారు. ఖర్చులు తగ్గించుకుంటారు. మీ బడ్జెట్ లో మార్పులు చోటుచేసుకుంటాయి.
సింహరాశి
కష్టపడి పనిచేసేవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. కొత్త ఇంటితోపాటు ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు మంచి లాభాలున్నాయి. ఒత్తిడి తగ్గి ఎంతటి పనినైనా సులువుగా పూర్తిచేస్తారు. ఎంతో కష్టపడతారు.. అందుకు తగ్గట్లుగానే ప్రతిఫలం ఉంటుంది.












Click it and Unblock the Notifications