weekly horoscope: ఈ వారం రాశిఫలాలు: వారం మధ్యలో పని పూర్తవుతుంది

ఈ వారం ఏ రాశి వారికి బాగుంటుంది? ఏ విధంగా కలిసొస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబ అంశాల్లో వారికి సంబంధించి ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయి? అంతా సానుకూలంగానే ఉందా? ఏదైనా ప్రతికూలత ఉందా? తదితర విషయాల్ని రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్యులు అంచనా వేస్తున్నారు. ఒక్కోరోజు ఒక్కో రాశివారికి కలిసివస్తుంది.

కొందరికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ వారం ఏ రాశివారికి బాగుందో ముందుగానే తెలుసుకుందాం. దీనివల్ల ఏదైనా సమస్యలుంటే బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు 6 నుంచి ఆగస్టు 12, 2023 వరకు వార రాశిఫలాలు ఎలా ఉన్నాయో? జ్యోతిష్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

weekly rashiphalalu from august 6th to august 12th 2023

తులా రాశి: అదృష్టం ఉంది. విజయాన్ని సాధిస్తారు. ధర్మబద్దంగా విధులు నిర్వహించడమే మిమ్మల్ని కాపాడుతుంది. భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలి. భూమి, వాహన యోగాలున్నాయి. ఎదురు చూస్తున్న పనులు పూర్తికావడంతోపాటు శత్రు దోషం తొలగుతుంది. లక్ష్మీదేవిని ధ్యానించాలి.

వృశ్చిక రాశి: కాలం అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనుల విషయాల్లో అప్రమత్తత కావాలి. సమయానికి తగినట్లుగా నిర్ణయాలు తీసుకోవాలి. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. అవసరమైన పని మాత్రమే చేయాలి. సమష్టి కృషితో విజయం సాధిస్తారు. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.

ధనుస్సు రాశి: అవసరాలకు సరిపడా డబ్బులు దొరుకుతాయి. అదృష్ట యోగం ఉంది. పెట్టుబడులు లాభాలానిస్తాయి. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. నిర్ణయాలు వెంటనే తీసుకోవాలి. అలసత్వం పనికిరాదు. ఇష్టదేవతను ధ్యానించాలి.

మకర రాశి: ఆర్థికంగా అనుకూలం. బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వర్తించాలి. చెడు అనేదాన్ని అసలు ఊహకు కూడా రానివ్వొద్దు. మంచితనం రక్షిస్తుంది. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.

కుంభరాశి: మానసికంగా దృఢంగా ఉండాలి. ఉద్యోగానికి సంబంధించిన ఫలితాలు అనుకూలిస్తాయి. పట్టుదలతో ముందుకు సాగాల్సి ఉంటుంది. సన్నిహితులతో సంప్రదించిన తర్వాతే ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఆవేశం పనికిరాదు. వ్యాపారంలో స్వల్పస్థాయిలో విఘ్నాలు ఎదురవుతాయి. శివుణ్ని ఆరాధించాలి.

మీన రాశి: ఏ పని తలపెట్టిన విజయం లభించేంతవరకు కృషిచేస్తూనే ఉండాలి. మంచి వ్యాపార యోగం సూచితం. భవిష్యత్తు బంగారుమయం అయ్యేలా నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగంలో మంచి జరుగుతుంది. ఖర్చుల్ని నియత్రించుకోవడంవల్ల కొన్ని సమస్యలు తొలగుతాయి. ఇష్టదేవతను ధ్యానించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+