వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రవి చంద్ర సంబంధిత యోగాలు అంటే ఏంటి..?

|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

జ్యోతిషశాస్త్ర ప్రకారం జాతకంలో గ్రహాల కలయికను యోగం అంటారు. వివిధ గ్రహాలు ద్వాదశ రాశులలో భావాలలో కలవడం వలన వాటి దృష్టి వేర్వేరు గ్రహాలపై పడటం వలన కలిగే మార్పులనే యోగం అని అంటారు. మానవుని జన్మరీత్యా నవగ్రహాపై గతులననుసరించి, ఆయుషుతో సహా భవిష్యత్తులో సంభవించే సుఖదు:ఖాలను అనేక యోగాలుగా మన పూర్వీకులైన ఋషులు నిర్ధేశించారు. వాటిలో కొన్ని యోగాలు, వాటి ఫలితాలు ఏమిటో తెలుసుకుందాం. మన జాతకంలో ఏమైనా యోగాలు ఉన్నాయో తెలుసుకుందాం.

According to astrology the combination of planets in the horoscope is called yoga.

1 ) బుధాదిత్య యోగం :- రవి బుధుడు ఏ రాశిలో ఉన్నా దానిని బుధాదిత్య యోగం అంటారు.

ఫలితం :- సామర్ధ్యం సూక్ష్మగ్రాహి, విచక్షణతో కూడిన కార్యాలు, పట్టు వదలని ప్రయత్నం వీరి స్వంతం.

2 ) శుభవేశి యోగం :- రవికి 2వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే శుభవేశి యోగం అంటారు.

ఫలితం:- ప్రశాంత జీవితం, కీర్తి, మర్యాద, అదృష్టం వరించుట.

3 ) శుభవాశి యోగం :- రవికి 12వ స్థానంలో శుభగ్రహాలు శుభవాశి యోగం అంటారు.

ఫలితం:- కీర్తి, సంపద, పలుకుబడి, వాక్పఠిమ, స్వయంకృషితో అభివృద్ధి.

4 ) ఉభయరాశి యోగం :- 2, 12 స్థానాలలో శుభగ్రహాలు ఉంటే ఉభయరాశి యోగం అంటారు.

ఫలితం:- సంతోషం, సంపద, కీర్తి, మర్యాద, పలుకుబడి, ప్రయత్నంతో ముందుకు రావడం.

* చంద్రుడు సంబంధిత యోగాలు :-

1 ) చంద్రమంగళ యోగం :- చంద్రుడు, కుజుడు ఒకే స్థానంలో ఉన్నా నేక చంద్రునికి కేంద్రంలో అంటే 1, 4, 7, 10 స్థానాలలోఉంటే చంద్రమంగళ యోగం అంటారు.

ఫలితం:- రసాయన, ఔషధ వ్యాపారంలో విజయం. మనో చంచలం రావడానికి అవకాశం.

2 ) వసుమతి లేక లక్ష్మి యోగం :- చంద్రునికి ఉపజయ స్థానాలయిన 3, 6, 10, 11 స్థానాలలో బుధుడు, శుక్రుడు, గురువు ఉంటే వసుమతి లేక లక్ష్మి యోగం అంటారు.

ఫలితం:- అకస్మాత్తుగా ధనాగమనం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ యోగ జాతకులకు ధనం కొరత ఉండదని శాస్త్రం చెప్తుంది.

3 ) గజ కేసరి యోగం :- చంద్రునికి కేంద్రంలో గురువు ఉంటే గజ కేసరి యోగం అంటారు.

ఫలితం:- కీర్తి ప్రతిష్టలు, శత్రుజయం, ధనాగమనం, సంపద, దీర్ఘాయువు.

4 ) అనపా యోగం:- చంద్రునికి 12 స్థానాలలో రాహువు, కేతువు మనహా మీలిన గ్రహాలు ఉంటే అనపా యోగం అంటారు.

ఫలితం:- ఆరోగ్యమైన శరీరం.

5 ) శునభా యోగం:- చంద్రునికి 2లో రాహువు, కేతువు మనహా మీలిన గ్రహాలు ఉంటే అనపా యోగం అంటారు.

ఫలితం:- స్వప్రయత్నంతో సంపాదన.

6 ) కేమాధ్రుమ యోగం:- చంద్రునికి 2, 12 స్థానాలలో ఏగ్రహాలు లేకుంటే అనపా యోగం అంటారు.

ఫలితం:- ఈ యోగం పీడ, కీడు కలిగిస్తుంది. అయినా కేంద్రం అంటే 1, 4, 7, 10 స్థానాలలో ఏదైనా గ్రహం ఉంటే నివృత్తి ఉంటుంది.

7 ) అది యోగం:- చంద్రుడికి 6, 7, 8 స్థానాలలో శుభగ్రహాలు ఉంటే అది యోగం అంటారు.

ఫలితం:- కారు,బంగళా లాటి వసతులు కలిగిన జీవితం.

8 ) శకట యోగం:- చంద్రునికి, 6,8, 12వ స్థానంలో గురువు ఉంటే శకట యోగం అంటారు. రాశి చక్రములోని గ్రహములన్ని లగ్నము, సప్తమ స్థానమల మాత్రమే ఉన్న శకట యోగము అంటారు. గురువు లగ్నము తప్ప మిగిలిన స్థానములలో ఉన్న శకట యోగము సంభవిస్తుంది.

ఫలితం :- నిలకడ లేని జీవితం, అవమానము, ఆఋధికబాధలు, శారీరక కష్టము, మానసిక బాధలు కలిగించును. ధనవంతుల ఇంత పుట్టినా ఈ యోగప్రభావమున పేదరికము అనుభవించ వలసి ఉంటుంది. అర్హతకు తగిన గౌరవము ఉండదు. మరిఏ ఇతర బాధలు ఉండవు. ఈయోగముకు భంగము ఏర్పడినప్పుడు సమస్యలు ఉన్నా గౌరవ మర్యాదలాకు భంగము వాటిల్లదు.

9 ) యోగభంగము :- చంద్రుడు బలము కలిగి ఉన్న ఈ యోగము భమ్గముఔతుంది. చంద్రుడి మీద కుజుడి దృష్టి ఉన్న ఎడల ఈ యోగము భంగము ఔతుంది. లగ్నాదిపతి, భాగ్యాధిపతి బలముగా ఉన్న ఈ యోగము భంగము ఔతుంది. గురువు చంద్రుడు కంటే బలముగా ఉన్న ఈ యోగము భంగము ఔతుంది. చంద్రుడు ఉచ్ఛస్థితిలో వృషభములో ఉన్న ఎదల ఈ యోగము భంగము ఔతుంది. చంద్రుడు స్వరాశి అయిన కతకములో ఉన్న ఈ యోగము భంగము ఔతుంది. రాహువు చంద్రుడితో కలసి ఉన్న ఈ యోగము భమ్గము ఔతుంది. రాహువు దృష్టి గురువు మీద ఉన్నప్పుడు ఈ యోగము భంగము ఔతుంది. లగ్నములో చంద్రుడు లేక గురువు ఉన్నా, శుక్రుడ్రు చంద్రుడితో కలసి ఉన్నా, ఈ శకత యొగము ధనప్రాప్తి కలిగించును. చంద్రుడు ఇదే యోగము చంద్రుడు మిధున, కన్యా, తులా, వృశ్చికములలో ఉన్న కలుగును. అలాగే కటకములో శుక్రుడు బుధుడితో కలసి ఉన్నా ఈ యోగము కలుగును.

10 ) తృతురా యోగం :- చంద్రునికి 2, 12 స్థానాలలో రాహువు, కేతువు కాక మిగిలిన ఏ గ్రహాలు ఉన్నా తృతురా యోగం అంటారు.

ఫలితం:- ఆదాయాన్ని మించిన ఖర్చులు, దారిద్యం నుండి విమోచనం దొరకడం కష్టం. స్వల్ప సంతానం, అమిత ధైర్యం, కూడబెట్టిన ధనం పరుల స్వంతం.

English summary
According to astrology the combination of planets in the horoscope is called yoga.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X