• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శార్వరి అంటే అర్థం ఏంటి..? ఈ సంవత్సరం ప్రజలకు ప్రశాంతత ఉండదా..?

|

2020 శార్వరి నామ సంవత్సరంలో నవనాయక ఫలితాలు

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

1) రాజు బుధుడు అయ్యాడు. 2) మంత్రి - చంద్రుడు, 3) సేనాధిపతి - రవి, 4) సస్యాధిపతి - గురువు,

5) ధాన్యాధిపతి - కుజుడు, 6) అర్ఘాధిపతి - రవి, 7) మేఘాధిపతి - రవి, 8) రసాధిపతి - శని , 9) నీరసాధిపతి - గురువు.

What is meant by Sarvari? Do people dont really live with peace this year?

ఈ సంవత్సరం 'రవి' సూర్యుడు 1.సైన్యాధిపతిగా, 2. అర్ఘాధిపతి, 3. మేఘాధిపతిగా మూడు భాద్యతలను చేపట్టాడు.

గురువు 1. సస్యాధిపతి, 2. నీరసాధిపతిగా రెండు భాద్యతలను చేపట్టాడు. ప్రధానంగా ఈ నవనాయకులు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.

* శార్వరి అంటే అర్ధం 'కటిక చీకటి' లేదా రాత్రి అని అర్దాన్ని సూచిస్తుంది. పేరుకు తగ్గట్టుగానే ఈ సంవత్సరంలో ప్రజలు సుమారు 60 శాతం ప్రశాంతత లేకుండా జీవించే ఆస్కారం గోచరిస్తున్నాయి.

* అధికార రాజకీయ వర్గం ప్రజా సేవకు అంకితం అవుతుంది.

* విద్య, వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉండదు.

* ప్రభుత్వ పరిపాలనా విషయంలో అనుకూలంగా ఉంటుంది.

* కుల, మత, వర్గ, ప్రాంతీయ విచక్షణలు అధికం అవుతాయి.

* ఎండా కాలంలో ఎండలు గతం కంటే ఎక్కువ ప్రచండంగా ఉంటాయి.

* కొన్ని గ్రామాలలో అల్లర్లు చెలరేగుతాయి.

* ప్రకృతి దయ మనుషులపై లేకుండా పోతుంది.

* ప్రజలను దోపిడి చేసే వాళ్ళే మేధావులుగా, గొప్పవాల్లుగా చలామణి అవుతారు.

* అన్ని రంగాలలో ధర్మం ఒంటి కాలుమీద కూడ నడవలేని పరిస్థితి కనబడుతుంది .

* వ్యవసాయం గతంలో కంటే బాగుంటుంది.

* దేశంలో విషాద దినాలు, ప్రతి విషయం వివాదస్పదంగా తయారు అవుతుంది, హింసలు ప్రజ్వరిల్లుతాయి.

* ప్రేలుళ్ళు, విస్పోటాలు, అగ్ని ప్రమాదాలు, భవంతులు కూలుట మొదలగునవి కలత చెందిస్తాయి ,

* ప్రాంతీయతత్త్వం పెరిగిపోతుంది. సాముహిక, ప్రత్యక్ష పోరాటాలు చరిత్రలో చీకటి అధ్యాయాలకు దారితీస్తాయి.

* ప్రముఖులకు ప్రాణ గండాలు సూచిస్తున్నాయి.

* గొప్ప గొప్ప నాయకులు, ఉన్నత అధికారులు, ఉన్నత స్థానంలో ఉన్నవారు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కుంటారు.

* నిర్మాణ సంబంధమైన పనులలో అవినీతి హద్దులు దాటిపోతుంది.

* ఫ్యాక్టరీలలో , గనులలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. నౌకలు మునుగుట, అంతరిక్ష నౌకలు విఫలం అగుట జరుగుతాయి.

* అనేక నష్టాలకు విద్రోహక చర్యలు ప్రధాన కారణాలుగా మారుతాయి.

* వర్షాలు వ్యవసాయానికి ఉపయోగపడతాయి. వ్యవసాయానికి తగిన ఫలితం దక్కుతుంది.

* రెండు సార్లు తూఫాన్లు వచ్చే సూచనలు, పెనుగాలుల వలన నష్ట భారం పడుతుంది.

* నిత్యవసర వస్తువులకు కొంత కృత్తిమ కొరత ఏర్పడుతుంది.

* కలుషితమైన ఆహార, పానీయాలు జీవితాలతో చెలగాటం ఆడుతాయి, పిల్లల ఆహార పదార్ధాలలో శ్రద్ద ఎక్కువ తీసుకోవాలి .

* దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రతికూలం, భూకంపాలు, ప్రకృతి ఉపద్రవాలు గోచరిస్తున్నాయి .

* వడగళ్ళ వానలతో విషాదాలు , పట్టణ ప్రాంతాలలో వర్షాల వలన వరదల వాతావరణం కనబడుతుంది.

* స్త్రీలు అధికార పదవులకు ఎంపిక అవుతారు.

* అశ్లీలం హద్దులు దాటుతుంది, మధ్య మోజు పెరుగుతుంది. వావి వరుసలు మంట గలుస్తాయి.

* యువత తేలికగా డబ్బులు ఎలా సంపాదించాలి అనే ఉహాల్లో తెలియాడుతుంటారు.

* మే, జూన్ నెలల్లో దేశారిష్టం - భూ కంపాలు గోచరిస్తున్నాయి.

* ఆర్ధిక మాంద్యం ఏర్పడుతుంది. ప్రజలు డబ్బులు పొదుపుగా ఖర్చులు చేసుకోవాలి.

* అన్ని ఆహార పదార్ధాలు కల్తీమయమై ఉండబోనున్నాయి కాబట్టి ఎవరి ఆరోగ్యం వారు కాపాడుకోవాలి. ప్రభుత్వం సూచించే నిబంధనలను సూచా తప్పకుండా పాటిస్తూ, బాధ్యతగా వ్యవహరిస్తూ, పరిసరాల శుభ్రతను పాటిస్తూ, సమాజ సేవలో తమ వంతుగా నైతికతను అవలంభిస్తూ, ప్రకృతి, పర్యావర్ణాన్ని కాపాడుకుంటూ గోమాతను పూజిస్తూ, జీవహింస మానండి. సాటి జీవులైన పశు పక్షాదులకు ఆర్ధిక శక్తి ఉన్నంతలో ఆహార పానీయాలను అందిస్తూ, శాకాహారభోజనాలు చేస్తూ ప్రతిరోజూ ధ్యానం, యోగ, దైవ చింతనతో ఉండగలిగిన వారికి ఏ ఇబ్బందులు తలెత్తకుండా భగవంతుడు రక్షణగా నిలుస్తాడు జై శ్రీమన్నారాయణ.

English summary
Saravari means darkness. In this year People will not remain with peace as the name mentions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X