ముందుగా మీరు వాస్తు అంటే ఏమిటి? దానివల్ల ఉపయోగాలు ఏమిటి? అనేది తెలుసుకోండి!

వాస్తు శాస్త్రం అనేది భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైన శాస్త్రం. ఇతర దేశాలు కొన్ని వాస్తు నిబంధనలు పాటిస్తున్నప్పటికీ దానికి, మనకు చాలా తేడా ఉంటుంది.కట్టడాల నిర్మాణానికి సంబంధించిన శాస్త్రీయ పద్ధతులను, వాటికి ఉండే దిశల ప్రాముఖ్యతను, ప్రకృతి శక్తుల సమతుల్యతను, నాణ్యమైన జీవితం కొనసాగించాలంటే ఏం చేయాలనేదానికి మార్గనిర్దేశకంగా ఉంటుంది. వాస్తు అనే పదం సంస్కృత పదమైన "వాస్" ( నివాసం చేయడం) నుంచి ఉద్భవించింది. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ కట్టడమైనా దిశలు, శక్తి కేంద్రాలు, పంచ భూతాల మధ్య సమతుల్యతతో నిర్మించాలి.

వాస్తు వల్ల ఉపయోగాలు ఏమిటి?
వాస్తు శాస్త్రం ప్రకారం నిర్మించిన కట్టడాల వల్ల.. అది ఇల్లు కావచ్చు.. దేవాలయం కావచ్చు.. కార్యాలయం కావచ్చు.. ఏదైనా సరే ఆధ్యాత్మిక, మానసిక శాంతిని కలిగిస్తాయి. శక్తి సమతుల్యత సరిగా ఉంటే, అందులో నివసించేవారు మానసికోల్లాసంతో ఉంటారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పొందుతారు. వాస్తు ప్రకారం నిర్మించిన ఇల్లు ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. అంతేకాదు.. గాలి, వెలుతురు సరిగా వచ్చేలా వాస్తు ప్రకారం ఇల్లు నిర్మించడం వల్ల ఎటువంటి అనారోగ్యం దరిచేరదు. ఎందుకంటే వెలుతురు బాగా వచ్చి బ్యాక్టీరియా చనిపోతుంది. ధారాళంగా గాలి రావడంవల్ల మనసు ఉల్లాసాన్ని అనుభవిస్తుంది.

What is Vastu What are its uses Find out what

ఉత్తరం వైపు కిటికీలుండాలి
మన దేశ సాంప్రదాయ ప్రకారం వాస్తుతో ఇల్లు నిర్మిస్తే అన్నీ శుభాలే కల్పించే శక్తులు వృద్ధి చెందుతాయి. ఉదాహరణగా చెప్పాలంటే వంటగది అంటే అగ్ని కాబట్టి అది సౌత్ఈస్ట్ లో ఉండాలి. సౌత్ వెస్ట్ లో పడక గది, తూర్పు, ఉత్తర దిశల్లో కిటికీలు ఉండాలి. కొందరు వాస్తును ఆచారంగా పాటిస్తారు. మరికొందరు మాత్రం శాస్త్రీయంగా తీసుకుంటారు. పూర్తిగా నమ్మకంపై ఆధారపడివుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+