ఇంటికి వీధి పోటు ఉంటే?.. రెండు వాకిళ్లు ఉంటే.. వాస్తు ప్రకారం ఏం చేయాలి?
ఇల్లు కొనే సమయంలో కొన్నిసార్లు అంతకు మించిన అవకాశం కనపడకపోవడంతో ఎక్కడో ఒకచోట రాజీపడి తీసుకుంటుంటాం. అలాగే వాస్తు సమస్యలు ఉన్నా నిపుణులతో సంప్రదించి పరిష్కరించుకుందామని భావిస్తుంటారు. ఇల్లు నిర్మించుకోవడం, లేదంటే ఫ్లాట్ తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి జీవితకాలపు కల. అందుకే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఇళ్లకు రెండు వాకిళ్లు ఉంటాయి. మరికొన్ని ఇళ్లకు వీధిపోటు ఉంటుంది. ఇటువంటి సమస్యలు ఎదురైనప్పుడు ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం.
ఒక్కో ఇంటికి రెండు వాకిళ్లు ఉంటాయి.
కొన్ని ఇళ్లకు తూర్పు, ఉత్తరం ఉంటాయి.
మరి కొన్ని ఇళ్లకు పడమర, దక్షిణం ఉంటాయి.
పడమర ఇంటికి రెండు ద్వారాలున్నప్పుడు ఏం చేయాలంటే..
ఇంటి యజమాని నైరుతి నుంచి బయటకు వెళ్లాలి.
పడమర వాయువ్యం నుంచి అయితే ఇంకా మంచిది.
దక్షిణ నైరుతిలో దారి ఉంటే దాన్ని మూసేయాలి.

వీధిపోటు ఉన్నంత మాత్రాన చెడు జరగదు.
కొన్ని వీధిపోట్లు చాలా మంచి ఫలితాలనిస్తాయి.
వీధిపోటు ఉత్తర ఈశాన్యంలో ఉంటే మంచి మేలు కలుగుతుంది.
అయితే ఉత్తర వాయువ్యంలో మాత్రం ఉండకూడదు.
ఒకవేళ ఉంటే స్థలాన్ని విభజించి, గోడ కట్టుకోవాలి.
దీనివల్ల వీధిపోటు సమస్య తలెత్తదు.
అవసరాన్ని బట్టి ఆ స్థలం వాడుకోవచ్చు.
వాస్తు నిపుణులను సంప్రదించి మరిన్ని సలహాలు తీసుకోవచ్చు.
వీధిపోటు పడమర, దక్షిణం ఉంటేనే జాగ్రత్తలు తీసుకోవాలి.
వీధిపోటు ఉన్న దిక్కులో బగువా అద్దం అమర్చాలి.
ఎత్తయిన ప్రహరీగోడ కడితే చాలా మంచిది.
ఆ గోడను మిగిలిన గోడలకంటే ఎత్తుగా, మందంగా కట్టాలి.
వీధిపోటు వైపు ఉన్న గోడకు ముదురు రంగులు వేయాలి.
అలాగే దానిపై స్వస్తిక్ చిహ్నం వేయాలి.
సింహద్వారం దగ్గర బయటకు చూసే గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.
వీధిపోటు సింహద్వారానికి తగలకుండా చూసుకోవాలి.
ఒకవేళ తగులుతుంటే కొంచెం పక్కకు జరుపుకోవాలి.












Click it and Unblock the Notifications