18నెలల తర్వాత త్వరలో కుంభరాశిలో కుజసంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు

జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలలో ముఖ్య గ్రహమైన కుజుడుకి ప్రాధాన్యత ఉంటుంది. కుజుడిని భూమి, ధైర్యం, శౌర్యం, నిర్భయం, కోపం, మరియు రక్తానికి కారకుడిగా భావిస్తారు. అందువల్ల కుజుడు కదలికలో మార్పు వచ్చినప్పుడల్లా ఈ అంశాలు ముఖ్యంగా ప్రభావితమవుతాయి. కుజుడు ఫిబ్రవరి 23వ తేదీన శని పాలించే కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు.

18 నెలల తర్వాత కుంభరాశిలో కుజ సంచారం

శని రాశి అయిన కుంభరాశిలో కుజ సంచారం 18 నెలల తర్వాత జరుగుతుంది. ఇది కొన్ని రాశుల వారికి స్వర్ణ యుగంగా మారుతుంది. సంపద మరియు ఆస్తి పెరుగుతుంది. ఇంకా కుజుడి కారణంగా లబ్ధి చేకూరే ఆ రాశుల గురించి డీటెయిల్స్ తెలుసుకుందాం.

with Mars transit After 18 months into Aquarius these people are experiencing a stroke of luck

వృషభ రాశి

ఫిబ్రవరి 23వ తేదీన శని పాలించే కుంభరాశిలోకి కుజ సంచారం వృషభ రాశి వారికి సానుకూల ఫలితాలను తెస్తుంది. ఈ సమయంలో కుజుడు మీ రాశిలో కర్మ భావానికి సంచరిస్తాడు కాబట్టి పనిలోను, వ్యాపారంలోను వృషభ రాశి జాతకులు పురోగతిని చూడవచ్చు. ఈ సమయంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారవేత్తలు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు. ఏ పని చేసిన సానుకూలత ఉంటుంది. లాభదాయకమైన ఒప్పందాలను చేసుకుంటారు.

మిధున రాశి

శని పాలించే రాశి అయిన కుంభరాశిలోకి కుజ సంచారం మిధునరాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. కుజుడు మీ రాశి నుండి కర్మగృహంలో సంచరిస్తాడు. ఈ సమయంలో మీకు అదృష్టం కలిసివస్తుంది. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి. మిధునరాశి వారు దేశ, విదేశాలకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. వీరి తార్కిక సామర్థ్యాలు కూడా బలపడతాయి. నిర్ణయం తీసుకోవడంలో వీరికి స్పష్టత వస్తుంది.

కుంభరాశి

కుజ గ్రహ సంచారం కుంభ రాశి జాతకులకు ప్రయోజనాలను చేకూరుస్తుంది. కుజుడు మీ రాశి నుండి లగ్న గృహానికి వెళ్లడం వల్ల ఈ సమయంలో వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో మీ గౌరవం, ప్రతిష్ట కూడా పెరుగుతాయి. వివాహమైన జంటలు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు. జీవిత భాగస్వామి కూడా పురోగతిని సాధిస్తారు.భాగస్వామ్య పని నుండి ప్రయోజనాలను పొందుతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+