నవపంచ రాజయోగంతో జనవరి 21వ తేదీలోకా ఈ రాశులు కుబేరులవుతారు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని అద్భుత యోగాలను ఏర్పరుస్తుంటాయి. జనవరి 15వ తేదీన గ్రహాల రాకుమారుడు బుధుడు, వరుణుడు 120 డిగ్రీల కోణంలో కలుసుకోబోతున్నాయి. దీన్ని ఒక అద్భుతమైన పరిణామంగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఏర్పడే యోగాన్ని నవపంచ రాజయోగం అంటారు. కొన్ని రాశులకు ఈ యోగం వల్ల ఆర్థికంగా కలిసిరాబోతోంది. ఎప్పటినుంచో అవని పనులు కూడా పూర్తవుతాయని పండితులు తెలియజేస్తున్నారు.
మిథున రాశి
ఉద్యోగస్థులకు వేతనాలు పెరగడంతోపాటు పదోన్నతులున్నాయి. భారీ మొత్తంలో ఆదాయం పెరుగుతుంది. కుటుంబ వ్యాపారం చేసేవారికి, ఇతర వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి లాభాలున్నాయి. ఆర్థికంగా గతంలో కంటే ఇప్పుడు బాగా బలపడతారు. అదనంగా ఆదాయం పెంచుకోవడానికి వనరులు దొరుకుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.

కన్యా రాశి
డిసెంబరు నెల చివరి వారం నుంచి జనవరి 21వ తేదీ వరకు ఈ రాశివారికి ఏది పట్టుకున్నా బంగారమే అవుతుంది. అంతేకాకుండా కెరీర్ పరంగా అనేకరకాల ప్రయోజనాలున్నాయి. దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా మంచి స్థితిలో ఉండటంవల్ల కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.
మకర రాశి
వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి. వాటివల్ల భారీ రాబడి వస్తుంది. ఈనెల 22వ తేదీ నుంచే వీరికి కలిసివస్తోంది. జనవరి 21వ తేదీ వరకు వీరికి అద్భుతంగా ఉంటుంది. కొన్ని సంవత్సరాల నుంచి అవకుండా పెండింగ్ లో ఉన్న పనులు కూడా చాలా సులువుగా పూర్తవుతాయి. చేసే ప్రతి పనిలో గౌరవం లభించడంతోపాటు ప్రశంసలు లభిస్తాయి. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.












Click it and Unblock the Notifications