ధర్మమార్గాన్ని వదలొద్దు.. మంచి ఫలితాలున్నాయి
జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు, 27 నక్షత్రాల గురించి పూర్తిగా చెబుతారు. నిర్దిష్ట సమయం తర్వాత గ్రహాలు తమ రాశులను మారుస్తుంటాయి. ఈనెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాశులవారీగా ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
తులా రాశి
ధర్మమార్గంలో ప్రయాణించేవారికి శ్రేయస్సు చేకూరుతుంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా ఏకాగ్రత అవసరం. మనం చేసే ప్రయత్నాలను బట్టి వాటి ఫలితాలు కూడా ఆధారపడివుంటాయి. పనులు వాయిదా వేయవద్దు. ఎప్పటి పనులు అప్పటికప్పుడు పూర్తిచేస్తుండాలి. భూమి, వాహన యోగాలున్నాయి. చేతికందేంత వరకు వచ్చిన పని మధ్యలోనే ఆగిపోతుంది. శివుణ్ని ఆరాధించాలి.

వృశ్చిక రాశి
అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి. ముఖ్యమైన పనుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆత్మవిశ్వాసం అవసరమవుతుంది. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఆవేశం వద్దు. ఏ పనిచేసినా కుటుంబ సభ్యులతో చర్చించి చేసేవి ఫలితాన్నిస్తాయి. మేలు కలగజేస్తాయి.
ధనుస్సు రాశి
పూర్వ పుణ్యం కాపాడుతుంటుంది. వారం మధ్యలో ఒక పని పూర్తవుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. స్థిరచరాస్తులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు తమ పై అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రశాంతంగా ఆలోచించుకొని భవిష్యత్తుకు పునాది వేసుకోవాలి. శుభ వార్తను వింటారు. సూర్య నమస్కారంవల్ల శక్తి లభిస్తుంది.
మకర రాశి
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. మేలు చేసేవారున్నారు. ఓర్పును పరీక్షించేవారు కూడా ఉన్నారు. కొన్ని సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తుంది. అనుకున్నది సాధించేంతవరకు కృషిని కొనసాగించండి. కుజ శ్లోకం పఠించాలి.

కుంభ రాశి
మొహమాటంవల్ల ఆర్థికంగా నష్టాలుంటాయి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వారి మనోభావాలను గౌరవించాలి. ధైర్యంగా ముందుకెళ్లడంతోపాటు ఏ పనినీ వాయిదా వేయవద్దు. అభీష్టసిద్ధి కలుగుతుంది. వివాదాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. ఇష్టదైవాన్ని స్మరించాలి.
మీనరాశి
ఏ పనినీ మధ్యలో ఆపొద్దు. ముఖ్యమైన వ్యక్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటుండాలి. వృథా ఖర్చులను అరికట్టాలి. ఇతరులకు డబ్బులిస్తే అవి తిరిగిరావు. ధర్మబద్ధంగా ముందుకు సాగాలి. విష్ణు సహస్ర నామం పఠించాలి.












Click it and Unblock the Notifications