సొంత ఇంటి కల నెరవేరేనా: మీ జాతకం ఇలా..

1. అప్పారావు అడిదం, మచిలీపట్నం, చదువు మధ్యలో ఆగిపోయింది

వయసుకూడా చాలా ఐంది. కుజ, రాహు, కేతు శని లదోషం ఎక్కువగా ఉండటం చేత మీకు విద్య ఆగి ఉండవచ్చు. రాహువు దశ నడుస్తూ ఉంది. పుణ్య బలం పెరిగేలా దానాలు చేసుకోండి. 'శ్రీహయగ్రీవాయ నమ:' అని జపించండి.

2. సత్య నారాయణ, జతిత్యాల. వివాహం

అష్టమాధిపతి 7లో ఉంది, శుక్రుడులో బుధుడు నడుస్తున్నాడు, ఏప్రిల్‌ దాటితే తప్ప దశ మారదు, మరొక సంవత్సరం తర్వాతే గురుబలం వస్తుంది.అప్పటి వరకూ వీటికి దానాలు పరిహారాలు చేసుకోండి. గ్రహాలకి దానాలు పరిహార ములు చేసుకోండి. వివాహానికి ఒక శ్లోకం అందించాం చదువుతూండండి. అంటే ఏంచేయాలో కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవిచదవండి.

3.సుమ, జ్యేష్ట కుమారుని వివాహం చేసుకోవచ్చా?

జ్యేష' పుత్రుడు, జ్యేష' పుత్రిక, జ్యేష'మాసం, జ్యేష' నక్షత్రంగల అమ్మాయి. జ్యేష' నక్షత్రంగల అబ్బాయి.వీటిలో రెండుకి మించరాదు.

4. అమల, సంతానం, కాకినాడ

మీకు సంతాన భావం బాగానే ఉంది, కానీ సంతాన కారకుడు వ్యయంలో ఉండి, కుజుడి చేత చూడబడటం వల్ల ఆకుజుడుకూడా రాహువుతో కలిసుండటం వల్ల ఒక్కోసారి సమస్యలు రావచ్చు, మీ భర్త జాతకాన్ని కూడా ఒక సారి పరిశీలించండి. స్వంత ఇంటికి కూడా అవకాశం ఉంది కానీ రాహువు దుష్ప్రభావం ఎక్కువగా ఉంది .దాహువుకు శాంతి దాన పరిహారాలు చేసుకోండి మరిన్ని వివరాలకి కింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

5. చంద్రశేఖర్‌, గ్రహ దోషాలు పోవడానికి ఏం చేయాలి,

పుట్టిన వివరాలేవీ లేవు అన్నీ నష్టాలు అన్నారు, ఐతే వివరాలు లేకుండా స్పష్టంగా సమస్య పరిష్కారాలు చెప్పడం కష్టం. సమస్య తీరాలంటే దానాలు దైవ ధ్యానాలు ఎక్కువ ఉపకరిస్తాయి. మరిన్ని వివరాలకి ఈకింద నవగ్రహ పరిహారాలు అనే ఆర్టికల్‌లో విడిగా అందించాం. అవి చదవండి.

Astrologer answers Telugu oneindia readers questions

6. హనుమంతుడు, తాడేపల్లి గూడెం, సంతానం

మీకు సంతాన భావంలో రాహువున్నాడు, దీనికి పరిహారం చేసుకోండి, సుబ్రహ్మణ్య పూజ చెసుకుంటూ ఉండండి. కింద పరిహారాలు అనే ఆర్టికల్‌లో ఇచ్చిన సంతాన శ్లోకాన్ని చదవండి.

7. దీక్షితులు, భద్రాచలం, ప్రభుత్వ ఉద్యోగం

మీకు గవర్నమెమట్‌ జాబ్‌కి అవకాశం లేదు.

8. ఫణికుమార్‌, కాకినాడ, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?

ఆగస్ట్‌లొపు మంచి కాలం ఉంది, కుజుడికి దానాలు చెసుకుంటూ ప్రయత్నించండి.

9. కావ్య. ఆర్‌, నంద్యాల, కుజ దోషం ఉందా?

మీకు కుజదోషం ఉంది.

10. సుమాంజలి, సికింద్రాబాద్‌, రెండో పెళ్లి, విడాకులు

విడిపోవాలనుకుంటే దానికి జ్యోతిష్కుడేం చేయడు, అవన్నీ మీరు మీ పెద్దలదగ్గర తెల్చుకోండి.

11. కిరణ్‌ రెడ్డి, రంగారెడ్డి, పెళ్లి బలం ఉందా?

మరొక సంవత్సరం దాకా పెళ్లికి బలంలేదు.

12. నిరుపమ, నిజామాబాద్‌, గవర్నమెంట్‌ జాబ్‌

మీకు గవర్నమెమట్‌ జాబ్‌కి అవకాశం లేదు.

13. నారాయణ,సికింద్రాబాద్‌, విదేశాలకి వెళ్లవచ్చా

విదేశాలకి వెళ్లె అవకాశం లేదు.

14. శ్రీనవాసులు, కోరుట్ల, ప్రేమవివాహం

మీకు ప్రేమ వివాహం జరుగుతుంది.

15. కెరియర్‌ గురించి / భవిష్యత్తుని గురిమచి రపశ్నలడిగినవారు

రామకృష్ణ యార్లగడ్డ 1981

నాగేశ్వర రావు మానే పల్లి , తణుకు

వెంకట రమణా రావు, చీరాల

తడగోని ప్రణతి, 13-08-93

యస్‌. యస్‌. యస్‌. వరప్రసాద్‌

నరసింహ మూర్తి,

మా వెబ్‌ సైట్‌లో సౌకర్యాలు కేవలం సూచనలేకానీ చర్చనీయాంశాలు చెప్పేంత సౌకర్యవేదిక కాదు ఎందుకంటే నెలకు 120 కిపైగా జాతకాలు చూడాలికదా.ఒకే జాతకాన్ని సమగ్రంగా చూడటమూ కుదరదు.సూచనప్రాయాముగా ఉండేవాటిని అడగండి .భవిష్యత్తు అంటే అదిచర్చనీయాంశం,అందులో చాల విషయాలుంటాయి (అంటే ఆరోగ్యం, ఇల్లు, ఆస్తి, విద్య, ఉద్యోగం, దాంపత్యంలాంటివి). పూర్తికెరియర్‌ గురించి చెప్పడానికి ఇది వేదిక కాదు. ఇది కేవలం చిన్న సూచనల వేదిక మాత్రమే. ఏదైనా ఒక ప్రశ్న అడగండి. ముందు ప్రశ్నలడగానికి మేంఇచ్చిన షరతులు, నియమావళిని, సూచనలు చదవండి. చదివి మీప్రశ్న పంపండి.

మీ ప్రశ్నలను, సందేహాలను పంపించాల్సిన ఈ మెయిల్ అడ్రస్ [email protected]

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+