భారీ అగ్ని ప్రమాదం..59 మంది మృతి
బ్యాంకాక్: థాయ్ రాజధాని బ్యాంకాక్‌లో గత రాత్రి నూతన సంవత్సర వేడుకల్లో పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడ ఓ నైట్ క్లబ్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 59 మంది దుర్మరణం పాలయ్యారు. 130 మందికి పైగా గాయపడ్డారు. ఇక్కడి ప్రముఖ నైట్‌క్లబ్ అయిన సంతిక' క్లబ్‌లో ఈ ఘోరం జరిగింది. వేడుకల్లో భాగంగా బాణసంచా పేలుస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాధమిక సమాచారం బట్టి తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు బైటకు వెళ్లేందుకు ఉన్న దారి కేవలం ఒక్కరు పట్టేది మాత్రమే కావటంతో తొక్కిసలాటలో మరికొంత మంది మృతి చెందారు. మృతదేహాలను క్లబ్ బయట వరుసగా పడుకోబెట్టారు. మృతుల బంధువుల ఏడుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications