హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలయ్యపై పురంధరేశ్వరి వాత్సల్యం

By Staff
|
Google Oneindia TeluguNews

Purandeswari
హైదరాబాద్: కేంద్ర మంత్రి, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి మరోసారి తీవ్ర స్ధాయిలో చంద్రబాబు నాయుడు మీద ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఇప్పటి తెలుగుదేశం పార్టీ పనిచేయడం లేదని ఆమె విమర్శించారు. తమ్ముడు బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడంపై ఆమె మీడీయా ఎదుట లౌక్యంగా వ్యాఖ్యానించారు. సోదరుడు ఏ పార్టీలో ఉన్నా బాగుండాలన్నది తన అభిమతమని ఆమె చెప్పారు.

ఐదేళ్ళ క్రితం గత ఎన్నికల్లో చంద్రబాబు మీద తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురంధరేశ్వరి కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకరు ఎమ్మెల్యేగా, ఒకరు ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా ఉన్న పురంధరేశ్వరి ఈసారి తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఎంత ఘాటుగా ప్రచారం చేస్తారో చూడాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X