వైయస్ కు చిరంజీవి సవాల్

Chiranjeevi
నిజామాబాద్: సామాజిక తెలంగాణ రాష్ట్ర సాధన తమ లక్ష్యం కావడం వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తమతో పొత్తు కుదుర్చుకుని ఉండదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. దానికి సమాధానం తెరాస చెప్పాల్సిందేనని ఆయన అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన ప్రజా అంకిత యాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రెండు చోట్ల నుంచి పోటీ చేయాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోందని, అందులో ఒకటి తిరుపతి కాగా రెండోది ముమ్మిడివరమని ఆయన చెప్పారు. రాష్ట్రంలో హంగ్ శాసనసభ ఏర్పడదని, రాష్ట్ర ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆయన అన్నారు.

మొగల్తూరు గ్రామానికి తాను ఏం చేయలేదనే ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన విమర్శిపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి తన సొంద గ్రామమైన బలవనూరుకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి రాక ముందు రాజశేఖర రెడ్డి తన సొంత గ్రామానికి ఏమీ చేయలేదని ఆయన చెప్పారు. రాజశేఖర రెడ్డి బలవనూరు నుంచి పులివెందులకు వలస వచ్చారని, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి పులివెందులకు ఏమీ చేయలేదని ఆయన చెప్పారు. రాజశేఖర రెడ్డికి తనను విమర్శించే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+