సాక్షి కోసం జగన్ 'త్యాగం'

మహా కూటమి నేతల ఆరోపణల నేపథ్యంలో జగన్ ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు. తనపై వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. కడప లోకసభ సీటు నుంచి పోటీ చేయించడానికి ఆయన పూర్తి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ప్రస్తుత పరిణామాలతో పోటీ నుంచి విరమించుకోవడమే శ్రేయస్కరమని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఆయన ర్యాలీలు కూడా నిర్వహించారు. ఒకానొక సందర్భంలో తన చిన్నాన్న వివేకానంద రెడ్డి చేత కడప లోకసభ సీటుకు రాజీనామా చేయించి పోటీ చేయడానికి కూడా సన్నద్ధమయ్యారు. అయితే పార్టీ అధిష్ఠాన వర్గం ఇష్టం చూపకపోవడంతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది.












Click it and Unblock the Notifications