ప్రకాశం: బాలయ్య వర్సెస్ బావ

మరో వైపు జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్నారు. ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని, ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ను ఎదుర్కోవడానికి బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లను రంగంలోకి దించడమే మార్గమని భావించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆ విషయంలో విజయం సాధించినట్లేనని భావించవచ్చు. కాగా, బాలయ్య తన సోదరి, కేంద్ర మంత్రి పురందేశ్వరిపై కూడా విమర్శలు చేయడానికి వెనకాడ లేదు. బాలయ్య విమర్శలను ఆయన బావ, పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఖండించారు. బాలయ్య చేసిన విమర్శల్లో నిజం లేదని, కావాలంటే తాను బాలయ్యకు స్క్రిప్టు రాసిస్తానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications