జూ. ఎన్టీఆర్ పిల్లవాడు: చిరంజీవి

Chiranjeevi
మచిలీపట్నం: జూనియర్ ఎన్టీఆర్ ను ప్రజారాజ్యం అధినేత చిరంజీవి చిన్న పిల్లవాడిగా కొట్టి పారేశారు. జూనియర్ ఎన్టీఆర్ తమపై చేసిన విమర్శలను పట్టించుకోవలసిన అవసరం లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన ఉత్తరాంధ్ర పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ కాంగ్రెసుపైనే కాకుండా చిరంజీవి నేతృత్వంలోని ప్రజారాజ్యం పార్టీపై కూడా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ విమర్శలను ఆయన పట్టించుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్ విమర్శలను పట్టించుకోవలసిన అవసరం లేదని ఆయన అన్నారు.

తన బావ మరిది అల్లు అరవింద్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పారు. అల్లు అరవింద్ ఒక వేళ పోటీ చేస్తే మచిలీపట్నం నుంచే చేస్తారని ఆయన చెప్పారు. రెండు రోజుల్లో తమ పార్టీ ఉమ్మడి గుర్తు విషయం తేలిపోతుందని ఆయన అన్నారు. తాత్కాలికంగా ఉమ్మడి గుర్తు కోసం ఇతర రాష్ట్రాల్లోని పార్టీలను సంప్రదిస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాము విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ పర్యటన తర్వాత ఉంటుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+