బాధ్యతలు స్వీకరించిన ఇఫ్తెకార్‌చౌదరి
ఇస్లామాబాద్: ఎట్టకేలకు పాక్ విపక్షాల కల నెరవేరింది. ప్రభుత్వం కక్షకట్టి తొలగించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తెకార్‌చౌదరి తిరిగి బాధ్యతలను స్వీకరించారు. ఆయనను ఆయనతో పాటు తొలగించిన ఇతర జడ్జిలందరినీ విధుల్లోకి తీసుకోవాలంటూ విపక్షాలు ఇటీవలే లాంగ్‌మార్చి నిర్వహించింది. విపక్షాల ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరటంతో వాటిని అణచేందుకు ప్రభుత్వం విఫలయత్నాలు చేసింది. వీలుకాకపోవటంతో ఎట్టకేలకు వారి డిమాండ్లకు తలొగ్గింది. తొలగించిన జడ్జిల్లో చాలామంది ఇప్పటికే విధుల్లో చేరగా ప్రధాన న్యాయమూర్తి మాత్రం గత అర్థరాత్రి బాధ్యతలు స్వీకరించారు.












Click it and Unblock the Notifications