హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కోసం ఉధృతంగా ప్రచారం చేస్తున్న ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు ప్రిన్స్ మహేష్ బాబు ఫోన్ చేశారు. ప్రచార సభలకు విశేష స్పందన లభిస్తున్నందుకు జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన అభివందించారు. పనిలో పనిగా జూనియర్ ఎన్టీఆర్ కు ఓ విజ్ఞప్తి కూడా చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సినీ నటి కోసం ప్రచారం చేయవద్దని మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ ను కోరినట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో కాంగ్రెసు అభ్యర్థి గల్లా అరుణపై రోజా పోటీ చేస్తున్నారు. గల్లా అరుణతో సినీ నటుడు, తన తండ్రి కృష్ణ కుటుంబానికి ఉన్న సాన్నిహత్యం దృష్ట్యా మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ కు ఆ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.