ఎన్నికల్లో కోట్ల డబ్బుల మూటలు
హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా డబ్బుల మూటలు కదులుతున్నాయి. పోలీసులు జరిపిన వివిధ తనిఖీల్లో రాష్ట్రంలోని పలు చోట్ల ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి ఉద్దేశంచిన లక్షలాది రూపాయలు పట్టుబడుతున్నాయి. అయిదేళ్ల క్రితం రాష్ట్రంలో ఎన్నికలు జరిగినపుడు కూడా డబ్బుల మూటలు కదిలాయి. మద్యం సీసాలు పంపిణీ జరిగింది. అయితే అదంతా పోలింగ్‌కు ఒకటి రెండు రోజుల ముందు జరిగేది. పోలీసుల దాడుల్లో డబ్బులూ పట్టుబడ్డాయి.
ఎన్నికలకు మూడు వారాల ముందు నుంచే కార్లలో, హెలికాప్టర్లలో అన్ని నోట్ల కట్టలు జిల్లాలకు పరుగులు తీస్తున్నాయి. తొలిదశ ఎన్నికలకు రెండు వారాల వ్యవధి ఉంది. ఇప్పటికే పోలీసులు ఐదు కోట్ల రూపాయలు పట్టుకున్నారు. బుధవారమే కోటిన్నర పట్టుబడ్డాయి. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి ఇది అద్దం పడుతోంది. టికెట్ వేటలోనే కోట్లతో సూట్‌కేసులు పట్టుకొని ఢిల్లీకి వెళ్లిన నేతల బండారం విమానాశ్రయంలో బయటపడింది. పార్టీ కోసం, సొంత ప్రచారం కోసం ఎంతెంత ఖర్చు పెట్టగలమో చెప్పిమరీ టికెట్లు సాధించుకున్నారు. అభ్యర్థిత్వం ఖరారైన మర్నాటి నుంచే పందేరం మొదలయింది.
బుధవారం నుంచి ఇప్పటి వరకు మూడున్నర కోట్ల రూపాయలు పోలీసుల చేతికి చిక్కాయి. నెల్లూరులో 60 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. పేలుళ్లు కూడా సంభవించాయి. ఇందుకు సంబంధించి పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. కడప జిల్లాలో ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసులు 12 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి నుంచి 2 లక్షల 9 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో 3.40 లక్షల రూపాయలు పోలీసులకు పట్టుబడ్డాయి. ప్రకాశం జిల్లాలో 2.35 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. విశాఖపట్నం జిల్లాలో ఒక మోటారు సైకిల్ ను తనిఖీ చేయగా 8 లక్షల రూపాయలు బయట పడ్డాయి. వరంగల్ జిల్లాలో 50 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎన్నికల్లో పంచడానికి ఉద్దేశించి 23 లక్షల రూపాయలు పోలీసుల చేతికి చిక్కాయి. నల్లగొండ జిల్లాలో 5.50 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. ఇంకా పలు చోట్ల డబ్బుల మూటలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఏపీ పోలీసులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు..? -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..?












Click it and Unblock the Notifications