హైదరాబాద్: ఓ ప్రక్క బాలకృష్ణ, తారకరత్న, ఎన్టీఆర్ తెలుగుదేశం తరపున,అటు ప్రజారాజ్యం తరుపున పవన్, చిరంజీవి, నాగబాబు ప్రచారం చేస్తూంటే కాంగ్రెస్ కూడా తన స్టార్స్ తో రోడ్ షోలు ఏర్పాటు చేయనుంది.ఈ నెల ఆరు నుంచి ధర్మవరపు, బానుచందర్, రాజా వైజాగ్ లో రోడ్ షోలలో పాల్గొననున్నారు. అలాగే జీవిత రాజశేఖర్, రాజశేఖర్ ఇద్దరూ ఈ నెల ఐదు నుంచి ఏడవ తేదీ వరకూ శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. ఆ తర్వాత వారే విజయనగంలో ఎనిమిది,తొమిదవ తేదీల్లో ప్రచారం చేస్తారు.