విశాఖపట్నం: తాము అధికారంలోకి వచ్చినా రాకపోయినా పార్టీకి సహాయకులుగా మాత్రమే ఉంటామని ఎలాంటి పదవులు ఆశించబోమని యువరాజ్యం అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. విజయనగరం బయలుదేరేముందు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో కుటుంబ వారసత్వంపై మీడియా ప్రశ్నకు సమాధానంగా పై వ్యాఖ్య చేశారు. రాజకీయాల్లో సేవలు అందించేందుకు తాను సినిమాలు కూడా వదులుకోవటానికి సిద్ధమన్నారు. రాజకీయమంటే పాటలూ, ఫైట్లు ఉండే రెండు గంటల సినిమా కాదంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ అన్నిటికీ సిద్ధపడే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారన్నారు.